జగన్మోహన్ రెడ్డిని విడివిడిగా ఎదుర్కోలేక  ఇద్దరు శతృవులు కొత్తగా ఏకమవుతున్నారు. ఈ పాటికే అర్ధమైపోయుంటుంది వాళ్ళెవరో. అవునండి బిజెపి, జనసేన గురించే ఇదంతా.  2019 ఎన్నికల్లో రెండు పార్టీలు వేటికవే జగన్ కు వ్యతిరేకంగా పోటి చేసి నేల మట్టమైపోయాయి. అంటే వీళ్ళకన్నా చాలా పెద్ద పార్టీ తెలుగుదేశమే జగన్ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిందనుకోండి అది వేరే సంగతి.  దాంతో మూడు పార్టీల్లోను కలవరం మొదలైంది. అందుకనే ముందుగా జనసేన, బిజెపిలు కలిశాయి.

 

కాకపోతే అవసరానికి వాడుకుని తర్వాత రెండుసార్లు వదిలేసిన చంద్రబాబునాయుడు అంటేనే ప్రస్తుతం బిజెపి నేతలు మండిపోతున్నారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత చంద్రబాబు మళ్ళీ బిజెపివైపు చూస్తున్నా కమలం పట్టించుకోవటం లేదు. అయితే   చంద్రబాబుకు బిజెపికి మధ్య ఉన్నంత వైరం పవన్బిజెపి మధ్య లేదు.  అందుకనే చాలా ఈజీగా పవన్+బిజెపి నేతలు కలిసిపోయారు. వీళ్ళద్దరి కలయకలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే విషయంలో విజయవాడలోని ఓ హోటల్లో సమావేశం అయ్యారు లేండి.

 

సరే అంతా బాగానే ఉంది కానీ వాస్తవంగా చూస్తే బిజెపికైనా జనసేనకైనా జనాల్లో బలం లేదన్నది వాస్తవం.  ఆ విషయం మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన రెండు పార్టీలకు చాలా చోట్ల డిపాజిట్లే రాలేదు. అసలు పోటి చేయటానికి అభ్యర్ధులే దొరకలేదంటే రెండు పార్టీల బలమేంటో తెలిసిపోతోంది. అలాంటిది జగన్ కు వ్యతిరేకంగా ఇపుడు రెండు పార్టీలు కలిస్తే మాత్రం ఏమవుతుంది ?

 

తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటి చేయటం ఖాయం. దాంతో రెండు పార్టీలు కలిసి పోటి చేస్తే జగన్ పై ఎంత ఒత్తిడి క్రియేట్ చేయగలవు అన్న విషయంపై ఓ క్లారిటి వచ్చేస్తుంది. ఈ రెండు పార్టీల ప్రభావం ఎంతమాత్రముంటుంది అనే విషయంపైనే  చంద్రబాబుతో చేతులు కలపటం ఆధారపడుంటుందనటంలో సందేహం లేదు. మరి కొత్త తయారైన శతృవు జగన్ పై ఏమాత్రం ప్రభావం చూపగలదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: