జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అదేమిటంటే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం సాధించాలని రెండు పార్టీల నాయకులు డిసైడ్ అయ్యారట. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం సాధిస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు లేండి. అంతకు ముందు మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  2024 ఎన్నికలే టార్గెట్ గా జనసేన+బిజెపి నేతలు కలిసి పనిచేయాలని డిసైడ్ చేసినట్లు ప్రకటించారు. రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరిన తర్వాత విజయవాడలో మొదటి సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో కన్నా ఆధ్వర్యంలో కొందరు కమలం నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని మరికొందరు నేతలు ఓ హోటల్ లో దాదాపు ఐదు గంటల పాటు సమావేశమయ్యారు లేండి. తర్వాత కన్నా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారం అందుకోవటమే లక్ష్యంగా పనిచేయాలని డిసైడ్ అయినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో అసలు కమలం పార్టీకి బలమే లేదు.

 

ఏదన్నా గాలి వీచినపుడు మాత్రమే ఏదో నాలుగు సీట్లు గెలుచుకుంటుంది.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకల్లో బిజెపి మొత్తం 175 అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేస్తే  ఐదారు చోట్ల డిపాజిట్లు వచ్చుంటే ఎక్కువ.  అలాగే సుమారు 145 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటి చేస్తే గెలిచింది ఒక్క అభ్యర్ధి మాత్రమే. అదికూడా అభ్యర్ధి గట్టితనం మీద గెలిచిందే కానీ పార్టీపరంగా కాదు.  మహా ఉంటే ఓ పదిసీట్లలో డిపాజిట్లు వచ్చిందేమో.

 

ఇలాంటి రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించి అధికారాన్ని అందుకుంటామని చెప్పటం జోక్ కాక మరేమిటి.  హోటల్లో కూర్చుని రెండు పార్టీల నేతలు అనేసుకుంటే సరిపోతుందా. జనాలు ఓట్లేయద్దు. పైగా ఏడు నెలల పరిపాలనలోనే జగన్ విషయంలో ప్రజలంతా విసిగిపోయారట. ఏ విషయం మీద జనాలు జగన్ పాలనపై విసిగిపోయారో మాత్రం రెండు పార్టీల నేతలు చెప్పలేకపోయారు.  సరే తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కలిసే పోటి చేస్తార కదా. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: