వైసీపీ ఎమ్మెల్యే జనసేన, బీజేపీ భేటీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలనుకోవడం అవకాశవాద రాజకీయమని మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందని జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఏమని పోరాటం చేస్తాయని మల్లాది విష్ణు ప్రశ్నించారు. 
 
బీజేపీ పార్టీకి నిలకడ లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తిప్పలు తప్పవని మల్లాదివిష్ణు చెప్పారు. జనసేన బీజేపీ భేటీ పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయని జనసేన పార్టీ పెట్టిన తరువాత పవన్ కళ్యాణ్ ఎవరితో నిలకడగా రాజకీయాలు చేశారో చెప్పాలని అన్నారు. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఉన్నారో రాజకీయాలలో కూడా అలానే ఉన్నారని అన్నారు. 
 
ఒక పార్టీ పెట్టిన వ్యక్తే పోటీ చేసి ఓడిపోతే ఇక ఏముంటుందని మల్లాది విష్ణు అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు ఏవైతే హామీలు మేనిఫెస్టోలో పెట్టారో ఆ హామీలన్నీ పూర్తిగా అమలు చేయడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని మల్లాది విష్ణు చెప్పారు. ఏడు నెలల కాలం పాలన చేసిన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఉద్యమం చేస్తామని చెబితే ప్రజలు నవ్విపోతున్నారని అన్నారు. 
 
చంద్రబాబు నాయుడు వ్యూహంలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని అన్నారు. 2014లో ఉన్న కూటమే ఈరోజు వేరువేరుగా ఏదో చేయాలి అనే ఆలోచన చేస్తోందని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీ పార్టీని, మోదీని అనరాని మాటలు అన్నారని మోదీని ఓడించటమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారని మల్లాది విష్ణు అన్నారు. బీజేపీ, జనసేన నేతల భేటీ వ్యూహంలో భాగమే అని మల్లాది విష్ణు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: