సామాజిక మాధ్యమం అనేది రెండు వైపులా ప‌దునున్న క‌త్తి లాంటిద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా ఎంత తొంద‌ర‌గా  ఫేమ‌స్ అయిపోవ‌చ్చో అంతే తొంద‌ర‌గా పరువు పోగొట్టుకోవచ్చు. ఇపుడు ఎల్లో సోషల్ మీడియా కూడా అదే దారిపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, జగన్ లు, విజయసాయి రెడ్డిలను మనం మూవీ ఫోటోలతో మార్ఫింగ్ చేసి పెట్టడం ఇపుడు పెద్ద దుమారమే రేగుతోంది.  

 

యజమానిగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దర్జాగా.. పెద్ద మనిషిలా కుర్చీలో కూర్చొని ఉంటే.. జగన్ కోట్ సూటు.. బూటు వేసుకొని పక్కన నిలబడినట్టు చూపించారు. అయితే ఏపీ సీఎం జగన్ ను కేసీఆర్ దత్తపుత్రుడిగా అభివర్ణించడంపై వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని సమాచారం. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ల కింద చేతులు కట్టుకొని కూర్చున్నట్టు చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారట. విజయసాయిరెడ్డిని కేసీఆర్ కు బానిసలా చూపించే ప్రయత్నం చేయడంపై మండిపడిపోతున్నారట. ఇలా మార్ఫింగ్ చేసిన ఫోటో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో అటు వైపీసీ  నేతలు, కార్యకర్తలు.. ఇటు టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 

 

ఎల్లో మీడియా ఇంతలా శ్రుతి మించుతుంటే ఇరు రాష్ట్రాల పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నట్టు వినికిడి. రాష్ట్రాధినేతలను  మార్ఫింగ్ చేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్న సదరు వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్టు సమాచారం. సాధారణంగా సామాజిక మాధ్యమాలు అనేవి నిజాలను నిర్భయంగా.. ప్రజలకు తెలియజేసే పనిలో ఉండాలి. జనాల్లో ఒకింత ఆసక్తిని సృష్టించాలి. కానీ ఇలా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ.. దిగజారేలా ప్రవర్తించకూడదని ఇరు పార్టీల వ్యక్తులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియా పిచ్చోడి చేతుల్లో రాయిలా మారుతోందని సదరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో అలర్ట్ గా ఉండే ఖాకీలు ఈ దుశ్చర్యలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ మనదే అనే ట్యాగ్ తో మార్ఫింగ్ ఫోటో సృష్టించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చలాయిస్తున్నట్టు చూపించే ఈ ఫోటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: