మున్సిపల్ ఎన్నికల టిక్కెట్లకు  సంబంధించి టిఆర్ఎస్ లో లొల్లి కంటిన్యు అవుతునే ఉంది. టిక్కెట్లు ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి ఓ నేత నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని బయటపడిన ఓ ఆడియో టేపు సంచలనంగా మారింది.  నిజానికి మంత్రి మల్లారెడ్డి ఏమో మొన్నటి అంటే ముందస్తు  ఎన్నికలకు ముందే టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. అదే సమయంలో నేత రాములేమో చాలా కాలంగా పార్టీలోనే ఉంటున్నారు.  ఇపుడు వీళ్ళిద్దరి మధ్య మొదలైన రూ. 50 లక్షల లొల్లి పార్టీలో సంచలనంగా మారింది.

 

 జిహెచ్ఎంసి పరిధిలోని బోడుప్పల్ డివిజన్లో  రాపోలు రాములు అనే నేతున్నారు. డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్ల పోటిపై తాను సిఫారసు చేసిన వాళ్ళకు టిక్కెట్లు ఇవ్వాలని రాములు ప్రయత్నించారు. టికెట్లు డిసైడ్ చేయటంలో మంత్రి మల్లారెడ్డి కీలకమవటంతో మంత్రిపైనే ఒత్తిడి పెట్టారట. అయితే రాములు కోరినట్లు టికెట్లు ఇవ్వటానికి  మంత్రి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్ధులకు బి ఫారాలు ఇచ్చేసింది. అభ్యర్ధులూ  నామినేషన్లను వేసేశారు. చాలా చోట్ల రెబల్ అభ్యర్ధులుగా నామినేషన్లు కూడా వేశారు. ఉపసంహరణలకు సమయం కూడా గడిచిపోయింది. చాలా డివిజన్లలో అధికారిక అభ్యర్ధులకు రెబల్స్ చెమటలు పట్టిస్తున్నారు. తన మద్దతుదారులకు   రాపోలు రాములు టికెట్ సాధించుకోవటంలో ఫెయిలయ్యారన్నది వాస్తవం.

 

ఇటువంటి  సమయంలో మంత్రికి తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రాములు ఇపుడు బయటపెట్టటంలో అర్ధమేంటి ? బయటపెట్టే ఆడియో టేపేదో  నామినేషన్లు వేయకముందే బయటపెట్టుంటే ఏమన్నా ఉపయోగం ఉండేదేమో. ఇపుడు రాములు ఏమి చేసినా ఉపయోగం ఉండదన్నది వాస్తవం. కాకపోతే తాజాగా బయటపడిన ఆడియో టేపు వల్ల పార్టీ నేతల్లో కన్ఫ్యూజన్ తప్ప మరేమీ జరగదు. కేటియార్ కాదు కదా స్వయంగా కేసియారే జోక్యం చేసుకున్న అభ్యర్ధుల విషయంలో చేయగలిగేదేమీ ఉండదంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: