తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి కి మున్సిపోల్స్ అనంతరం  కేబినెట్ నుంచి  ఉద్వాసన తప్పదా ? అంటే అవుననే టీఆరెస్ వర్గాలు అంటున్నాయి . మున్సిపల్ ఎన్నికల్లో  టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణల నేపధ్యం లో మంత్రిని  కేబినెట్ తప్పించనున్నారన్న ప్రచారం అధికార పార్టీ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది . మేడ్చల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మల్లారెడ్డి , తన నియోకవర్గ పరిధిలోని బోడుప్పల్ , పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల టికెట్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆ పార్టీ నాయకుడు రాపోలు రాములు ఆరోపించారు .

 

మంత్రితో అయన జరిపిన ఫోన్ సంభాషణ కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మంత్రి ఏకపక్షంగా వ్యవహరంచడమే కాకుండా , ఇష్టారీతిలో టికెట్ల కేటాయించారని రాపోలు రాములు మండిపడ్డారు .  తాను 12  వార్డు టికెట్ల అడిగితే ఇవ్వలేదన్న ఆయన , ఒకదశలో మంత్రి సమాధానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ , టికెట్ల కోసం ని చుట్టూ తిరగాలా? , ప్రజల మధ్య ఉండాలా?? అని ప్రశ్నించారు . టికెట్ల కోసం మంత్రి నడిపిన బేరసారాల ఆడియో , వీడియో ఆధారాలు తనవద్ద ఉన్నాయన్న రాములు ... వాటిని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ , కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అందజేస్తానని చెప్పుకొచ్చారు .

 

తనపై పోలీసు దాడులు చేయిస్తావని తెలుసంటూనే , ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు  ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమంటూ  మంత్రికి సవాల్ చేశారు  . మంత్రి , పార్టీ నాయకుడి మధ్య జరిగిన ఫోన్  సంభాషణ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన నేపధ్యం టీఆరెస్ నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది . మున్సిపోల్స్ అనంతరం కేబినెట్ విస్తరణ పేరిట మల్లారెడ్డి కి ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని  ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి . చూడాలి మరి ఇందులో నిజమెంతో ?

మరింత సమాచారం తెలుసుకోండి: