చంద్రబాబునాయుడుకు బిజెపి అగ్రనేతలు పెద్ద షాక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.  బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఢిల్లీలో కమలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాతో పవన్ భేటి అయినపుడు పొత్తులు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.  దానికి కొనసాగింపుగానే గురువారం విజయవాడలోని ఓ హోటల్లో రెండు పార్టీల నేతలు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రెండు పార్టీల నుండి సుమారు 15 మంది నేతలు కూర్చుని మాట్లాడుకున్నారు.

 

సమావేశంలో ఏం మాట్లాడుకున్నారన్న విషయం పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే  బిజెపి తరపున చర్చల్లో ఎవరెవరు పాల్గొన్నారన్నదే అసలైన పాయింట్. కమలం పార్టీ తరపున చర్చల్లో పాల్గొన్నవారిలో అందరూ చంద్రబాబునాయుడుకు బద్ధ వ్యతిరేకులే ఉండటం గమనార్హం. ఏపి ఇన్చార్జి సునీల్ దియోధర్, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు, ఎంఎల్సీ సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి జనేసేన అధినేత పవన్ తో చర్చించిన వారిలో ఉన్నారు.

 

అంటే చంద్రబాబు వ్యతిరేకులంతా చర్చల్లో పాల్గొనటం చూస్తే  యాధృచ్చికమేమీ కాదనే అనిపిస్తోంది. బిజెపి తరపున చర్చలు జరిపిన వారిలో ఒక్క రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మాత్రమే చంద్రబాబుపై సాఫ్ట్ కేర్ ఉంది. బహుశా ఈ సాఫ్ట్ కార్నర్ కూడా టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి వల్లే ఉండుంటుందనే అనుమానం కూడా అందరిలోను ఉంది.

 

సరే విషయం ఏమైనా ఇంతమంది చంద్రబాబు వ్యతిరేకులను ఏరి కోరి చర్చలకు పంపటంలో అగ్ర నాయకత్వం ఆంతర్యం ఏమయ్యుంటుంది ? పైగా సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ లాంటి రాజ్యసభ ఎంపిలతో పాటు  చాలా మందే ఉన్నారు. పైగా ఉమ్మడి సమావేశం ముగిసిన తర్వాత సునీల్, జీవిఎల్  మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంతో పొత్తులు ఎట్టి పరిస్ధితుల్లోను ఉండదని బల్లగుద్ది మరీ ప్రకటించటం చూస్తుంటే  చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చినట్లే అనిపిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: