తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలుసిందే.  దీంతో తెలంగాణలో రాజకీయాలని ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సొంతమయ్యాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయం అని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా గెలుపు గుర్రాలను బరిలోకి దింపి భారీ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్ళురుతున్నాయి అన్ని పార్టీలు. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఏ ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఓడిపోకుండా అన్ని స్థానాల్లో విజయం సాధించాలని గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు అందరికీ దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఎక్కడ ఓడిపోయిన మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ  హెచ్చరికలు జారీ చేశారు. 

 

 

 ఇకపోతే అటు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తోంది. కేవలం గెలుస్తారు అన్న వాళ్ళకే పార్టీ నుండి బీ ఫారాలు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడం లేదని మిమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ... మున్సిపల్ ఎన్నికలు టికెట్ల కేటాయింపుపై కోర్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 

 

 

 నాలుగైదు చోట్ల బలమైన అభ్యర్థులు ఉండటంవల్ల కొందరికి న్యాయం చేయలేక పోయాము  అని ఆయన పేర్కొన్నారు. కానీ వారి సేవలు మాత్రం తప్పకుండా వినియోగించుకుంటామని వెల్లడించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాస్ నీలిమ శ్రీనివాస్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ అభ్యర్థిని  ప్రకటించే దమ్ము ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డిలో 40 స్థానాల్లో  వరకు  కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని  ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: