ఎల్లోమీడియా.. ఏపీ రాజకీయాలు ఫాలో అయ్యేవారికి ఈ ఎల్లో మీడియా అంటే ఏంటో ప్రత‌్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీడియా ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ ఎల్లో మీడియా నేరుగా చంద్రబాబు కోసం చేస్తోందో కూడా తెలుసు.. కానీ ఇదే మీడియా కొందరికి పరోక్షంగా కూడా సపోర్ట్ చేస్తుంటుంది. ఏదేమైనా టీడీపీ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం.

 

ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఈ ఎల్లో మీడియా పవన్ కల్యాణ్ పై ఇతరులు చేసే విమర్శలను బాగా తగ్గించి చూపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా బీజేపీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీనిపై సిపిఐ నేత నారాయణ ఘాటుగా విమర్శించారు.

 

పవన్ తీరును ఏకి పారేశారు. పవన్‌వి స్వార్థ ప్రయోజనాలని.. ఆయన మాకు దూరమైనందుకు బాధ పడటం లేదని అన్నారు. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉందని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

 

వామపక్షాలకు బాకీ లేదన్న పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారని ఘాటుగా అన్నారు. అవకాశ వాదంతో పార్టీలు మారడం సహజం. అయితే.. సిద్ధాంతాలు నచ్చాయని వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్‌ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్‌ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్‌ కూడా దేశద్రోహే అని సీపీఐ నారాయణ ఓ రేంజ్ లో పవన్ పై విరుచుకుపడ్డారు.

 

అయితే పవన్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న ఎల్లో మీడియా.. ఇవేమీ ఇవ్వడం లేదు.. కేవలం ఈ పరిణామం దురదృష్టకరమని.. ఏ పార్టీతో కలవాలనుకున్నది వన్ ఇష్టం అని మాత్రమే నారాయణ అన్నట్లు సదరు ఎల్లో మీడియా ఆ విమర్శల తీవ్రతను బాగా తగ్గించేసింది. మరి ఈ వ్యూహం ఏంటన్నది ముందు ముందు అర్థమయ్యే ఛాన్సు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: