ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మరియు బిజెపి పార్టీ కలిసి భవిష్యత్తు రాజకీయాలు చేయడానికి కూటమిగా ఏర్పడటం తో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

 

అయితే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవడం వెనకాల ఉన్న అసలైన సూత్రధారి ఎవరో అన్నది బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజేపీ.. జనసేన మద్య పొత్తుకు కారణం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ గా చెబుతున్నారు.

 

కర్ణాటకలోని ఉడిపికి చెందిన సంతోష్ దీర్ఘకాలంగా సంఘ్ లో పని చేశారు. అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వెళ్లిన యడ్డీ కారణంగా కర్ణాటక బీజేపీని నడిపించింది ఆయనే

 

అయితే పార్టీకి ఎంతో విధేయుడిగా పని చేసే ఈయన ఈశాన్య రాష్ట్రాలలో మరియు దక్షిణాదిలో కూడా బిజెపి పార్టీ బలపడాలని మిషన్ ప్రారంభించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ యొక్క ఉనికి మరియు ఆంధ్ర యొక్క రాజకీయాలు బట్టి పవన్ కళ్యాణ్ తో పని చేస్తే ఖచ్చితంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ పొరబడటం గ్యారెంటీ అని భావించి తనకు అత్యంత సన్నిహితుడు శిష్యుడు అయిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా చేత రాయబారం పవన్ కి తెలిపి జనసేన బీజేపీ పొత్తు భాగస్వామ్యంలో బీఎస్ సంతోష్ వెనక ఉండి కథ నడిపించినట్లు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: