40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని 2019 ఎన్నికల్లో దాదాపు 40 ఏళ్లకు పైగా వయసు కలిగిన వైఎస్ జగన్ చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది. కనీసం దరిదాపుల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకునే స్థితి లేదు అన్నట్టుగా దారుణంగా కొద్దిపాటి శాతంతో ప్రతిపక్షం కూడా పోయే విధంగా వైయస్ జగన్ 2019 ఎన్నికల్లో చంద్రబాబు కి ఊహించని షాక్ ఇవ్వటంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడింది అంటూ 2019 ఎన్నికల తర్వాత నుండి ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

 

నేపథ్యంలో టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వల్ల కూడా పార్టీకి కొంత డ్యామేజ్ జరిగిందని లోకేష్ పార్టీని నడిపించడంలో పనికిరాడు అంటూ చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీకి ఎప్పటినుండో అండగా ఉంటున్న సీనియర్లు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని చంద్రబాబు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ అనుచర వర్గం ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీకి నమ్మకం గా ఉంటూ వస్తున్న నేపథ్యంలో కరణం బలరామకృష్ణ అనుచరులు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తో వేసిన ఫ్లెక్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఫ్లెక్సీపైరాబోయే కాలానికి కాబోయే సీఎం... 2024 నెక్ట్స్ ఏపీ సీఎంఅంటూ తాటికాయలంత అక్షరాలతో రాయటంతో విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: