బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం పై పవన్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. పవన్ చెప్పిన సరికొత్త రాజకీయం ఇదేనా అంటూ ఇప్పటికే జనసేన పార్టీని, పవన్ ను ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ నాయకులు చాలామంది తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ఈ అంశంపై  తన స్పందన తెలియజేసారు.అది కూడా జనసేనానిని వెటకారం చేస్తూ విమర్శలు చేశారు. పవన్ ను మించిన రాజకీయ అవకాశ వాది ఇంకొకరు ఉండరని, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ మండిపడ్డారు.


 జనసేన పార్టీని ఓఎల్ఎక్స్ అమ్మకానికి పెట్టిన సైద్ధాంతిక వేత్త పవన్ అంటూ వెటకారంగా కామెంట్ చేశారు. ఇప్పటికిప్పుడు పవన్ బిజెపిలో కలవడం వెనుక ఉన్న కారణాలేమిటో ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన కోరారు. బిజెపితో మామూలుగా వెళ్లి పొత్తు పెట్టుకునే బదులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎందుకు ఎందుకు పెట్టలేదు అంటూ నాని ప్రశ్నించారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అంటూ ప్రధాని మోదీ, అమిత్ షాల తాట తీసి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా అంటూ పవన్ డిమాండ్ చేశారు.

 

 ఓఎల్ఎక్స్ లో దేనినైనా అమ్మకానికి పెట్టవచ్చు అని తనకు తెలుసునని, కానీ ఒక రాజకీయ పార్టీని ఓఎల్ఎక్స్ లో పెట్టొచ్చు అనే విషయం నాకు నిన్ననే అర్థం అయింది అంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు ఆఫర్లు పెడుతూ పార్టీని పవన్ అమ్ముకుంటున్నారని నాని విమర్శించారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తే ఓఎల్ఎక్స్ లో జనసేన అమ్మకం అంటూ నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కొంతమంది నాని వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి కే ఈ విషయంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ కూడా స్పందించారు. జనసేన బిజెపిలో పవన్ కలిపేస్తున్నారని తాను ఎన్నికల ముందు చెప్పినా... ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు అదే జరిగింది అంటూ పాల్ చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: