ప్రతిపక్షాలను  జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత మూడు రాజధానులంటూ  జగన్ కొట్టిన దెబ్బకు దాదాపు అన్నీ ప్రతిపక్షాలు రోడ్లుపట్టుకు తిరుగుతున్నాయి.  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్ధితి మరీ ఘోరంగా తయారైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఏకంగా ఇంకో పార్టీతో పొత్తులే పెట్టేసుకున్నారు.

 

కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో ఠికాణా కూడా లేని బిజెపి నేతల్లో స్పష్టమైన చీలిక వచ్చేసింది. వామపక్షాల్లోని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అయితే చంద్రబాబుతో పాటు రోడ్లపై జోలెపట్టుకుని  తిరుగుతున్నారు. రెండో  పార్టీ సిపిఎం అసలు ఎక్కడా చప్పుడే చేయటం లేదు. కాంగ్రెస్ అయితే ఏమి మాట్లాడాలో కూడా తేల్చుకోలేకపోతోంది. స్ధూలంగా ఇది రాష్ట్రంలోని ప్రతిపక్షాల పరిస్ధితి. గతంలో  ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు ఇటువంటి పరిస్దితి ఎదురయ్యుండదేమో.

 

జగన్ కు వ్యతిరేకంగా తానొక్కడే పోరాటం చేయలేకపోతున్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే తనకు మద్దతుగా రంగంలోకి పవన్ కల్యాణ్ ను కూడా తీసుకొద్దామని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఎగురుకుంటూ వెళ్ళి బిజెపి చంకలో ఎక్కి కూర్చున్నారు. అదే సమయంలో బిజెపి నేతలు కూడా జగన్ పై ఎటువంటి ఒత్తిడి తేలేకున్నారు. ఎందుకంటే జగన్ ప్రతిపాదనను కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరికొందరు నేతలు వ్యతిరేకిస్తున్న నేతలకు కౌంటర్లిస్తున్నారు. దాంతో కమలం పార్టీ నేతలే రెండుగా చీలిపోయారు.

 

ఈ నేపధ్యంలోనే  తనకు తానుగ పొత్తు పెట్టుకుంటానంటూ ఎగురుకుంటూ వచ్చిన పవన్ ను బిజెపి దగ్గరకు తీసుకుంది. కానీ పవన్ స్ధిరత్వంపై కమలం పార్టీ నేతల్లో పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడేమి మాట్లాడుతాడో పవన్ కే తెలీదు కాబట్టి. హై కోర్టును కర్నూలులో పెట్టటాన్ని బిజెపి నేతలు స్వాగతిస్తే పవన్ మీడియా సమావేశంలోనే వ్యతిరేకించారు. దాంతో బిజెపి నేతలకు షాక్ కొట్టినట్లైంది. దీనిబట్టి జగన్ కొట్టిన దెబ్బ ప్రతిపక్షాలకు మామూలుగా తగల్లేదని అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: