భారతీయ జనతా పార్టీ (బీజేపీ ), జనసేన లు జతకట్టడం వల్ల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కే ఎక్కువ నష్టమా ? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు . 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ,  బీజేపీ , జనసేన లు కలిసి పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి . ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధికారాన్ని తృటిలో చేజార్చుకుంది .

 

 ఏడు నెలల క్రితం  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ , బీజేపీ , జనసేన లు వేర్వేరుగా పోటీ చేయడం తో , వైస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి  అధికారాన్ని చేజిక్కించుకుంది . ఈ ఏడునెలల వ్యవధిలో రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యం లో బీజేపీతో  జట్టు కట్టాలని జనసేనాని నిర్ణయించుకున్నారు .  ఈ రెండు పార్టీలు రాజకీయంగా జట్టు కట్టడం వల్ల వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమి లేకపోయినా ,  రానున్న ఎన్నికల్లోను టీడీపీ అధికారానికి దూరమయ్యే  అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు .

 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , జనసేన లు వేర్వేరుగా పోటీ చేసిన ఆ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే అంతంతమాత్రమేనని , ఇక టీడీపీ తో కలిపి చూస్తే అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాసింత చేరువగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు . ఈ నాలుగేళ్ళ లో బీజేపీ , జనసేనలు ఎంతగా పుంజుకున్న అధికార పార్టీని ఢీ  కొట్టే అవకాశాలంతంత మాత్రంగానే కన్పిస్తున్నాని చెబుతున్నారు. అదే టీడీపీ తో కలిస్తే మాత్రం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు పార్టీల కూటమి గట్టి పోటీనిచ్చే అవకాశాలు లేకపోలేదని వెల్లడిస్తున్నారు . అప్పుడు అధికార మార్పిడి జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn