తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే దీంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం తహతహ లాడుతున్నాయి. ఇక ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రచార రంగంలో అన్ని పార్టీలో జోరుగా దూసుకుపోతున్నాయి.ఓటర్ మహాశయులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి  అన్ని పార్టీలు. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఏ ఒక్క స్థానంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే  ప్రసక్తేలేదని... దానికి సంబంధించిన బాధ్యతను మంత్రులు ఎమ్మెల్యేలు వహించాల్సి వస్తుంది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఏ ఒక్క కార్పొరేషన్ ఓడిపోయినా మంత్రి పదవులు ఊడిపోతాయి అంటూ హెచ్చరించారు. 

 

 

 ఇకపోతే అన్ని జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రచార హోరు మొదలు కావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇకపోతే నిజాంబాద్ ఎంపీ అరవింద్ టిఆర్ఎస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిజాంబాద్ ఎంపీ  విమర్శలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కౌంటర్ ఇచ్చారు. నగర మేయర్ గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కాకపోతే తాను ప్రెస్ క్లబ్ నుంచి కంటేశ్వర్ వరకు ముక్కు నేలకు రాస్తానని అంటూ సవాల్ విసిరారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన బీగాల గణేష్ గుప్తా ఈ వ్యాఖ్యలు  చేస్తారు. ఎంపీ అరవింద్ లాగా  తాము బాండ్ పేపర్ లో రాసి ఇచ్చి మాట మార్చే అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు గణేష్ గుప్తా. 

 

 

 తాము చేసిన అభివృద్ధి పనులు... బీజేపీ మేనిఫెస్టో లో రాసుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఆయన. నిజాంబాద్ మేయర్ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారని నిజాంబాద్ ఎంపీ అరవింద్  చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తప్పుపట్టారు. స్థానిక నేతనే  టీఆర్ఎస్ కార్పొరేటర్ అవుతాడు అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఎంఐఎం పార్టీకి ఆ పదవి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బైంసా అల్లర్లపై ఇక్కడ దీక్ష చేయడం ఏమిటని  ప్రశ్నించారు గణేష్ గుప్తా. అక్కడికి వెళ్లి దీక్షలు చేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: