తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. జోరుగా ప్రచారాలను సాగిస్తూ. ఈ సారి కూడ భారీ మెజారీటితో గెలిచి తమకు తిరుగులేదని చాటుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా, కనీసం ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌లోనైనా కారు స్పీడ్‌కు బ్రేక్ వేసి ఆపాలని ప్రతిపక్షాలు గట్టి నిర్ణయంతో ఉన్నట్లుగా సాగుతున్న ఈ పురపోరులో తుది విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

ఇకపోతే కేటీఆర్ మాట్లాడుతూ సంక్రాంతి ముగ్గుల్లో రంగు రంగు ముగ్గులున్నా, మున్సిపోల్స్‌లో మాత్రం గులాబీ రంగు మాత్రమే పోటెత్తాలంటు పిలుపును ఇస్తున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ బాధ్యతలు తన భుజస్కందాలపై మోస్తున్న కేటీఆర్‌ మున్సిపల్ ఎన్నికల బరిలో, రంజు మీదున్న పుంజులా కనిపిస్తున్నారని ఎమ్మెల్యేలంటున్నారట. ఇకపోతే గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో, ఇప్పటికే కేటీఆర్‌కు, గ్రామస్థాయిలో కార్యకర్తలు హారతి పట్టారు.

 

 

తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కేటీఆర్‌ మార్క్‌ చూపిస్తే, ఇక గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడాలేకుండా, కేటీఆర్‌కు పట్టు లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకుగాను కేసీయార్ ఈ ఎన్నికల్లో తన కొడుకు కేటీయార్ తప్పక విజయాన్ని సాధించుకు వచ్చి తన వారసుడు అనిపించుకుంటాడనే ధీమాగా ఉన్నాడట.

 

 

ఇక ఈ ఎలక్షన్స్‌లో హరిష్ రావ్ జాడ ఎక్కడ కనబడుతలేదు, ఆయన గొంతు ఎక్కడ వినబడుత లేదు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం తేడాలొచ్చినా  చర్యలు తప్పవని ఇఫ్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కేసీఆర్ హెచ్చరికలు జారి చేసారు..

 

 

ఇకపోతే తనపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఇక కేటీఆర్. పురపోరులో అఖండ ఫలితాలు సాధించి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడో లేదో తెలియాలంటే రిజల్ట్ వచ్చే దాక ఎదురు చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: