ఒక ఓటమి మనిషిని మారుస్తుందనేది నిజం. అదెలా మారుస్తుందంటే, రెండోసారి ఆ తప్పు జరుగకుండా అప్రమత్తం చేస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ పెద్ద నేత కూతురు కవిత విషయంలో ఇది రివర్స్‌గా జరుగుతున్నట్లుగా వినిపిస్తుంది. ఇకపోతే ఎంతో ఉన్నతంగా ఆలోచించే కవిత పదవి ఉన్నంత వరకు ప్రతి విషయంలో గాని, పార్టీలోని కీలక నిర్ణయాల్లో గాని ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా చురుకుగా పాల్గొనేది.

 

 

కాని ఇప్పుడు ఎక్కడ ఆమె కనిపించడం లేదు, ఆమె గొంతు వినిపించడం లేదు. ఒక వైపు ఈ మున్సిపల్ ఎలక్షన్లో గెలిచి కేసీయార్ అంటే తిరుగులేని నాయకుడని నిరూపించుకోవాలని అనుకుంటున్న తండ్రికి తగ్గ తనయురాలుగా కవిత రాజకీయాల్లో పాల్గొనకుండా అజ్ఞాతంగా ఉండటం వెనక ఉన్న మర్మం తెలిక ఆ పార్టీ శ్రేణులే ఆలోచనలో పడ్డారట. ఇకపోతే ఎంపీగా ఉన్నప్పుడు అదే పనిగా మాట్లాడిన కవిత ఓడిపోయాక దాదాపుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూనే ఏవిషయంలో కూడా స్పందించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి నిశ్శబ్దంగానే ఉంటుంది..

 

 

ఈమె వాలకాన్ని చూసిన వారు పదవి లేకపోతే ప్రజలతో తనకు పని లేనట్లు భావిస్తున్నదేమో అని అనుకుంటున్నారట. ఇక ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లు టీఆర్‌ఎస్‌కు కీలకమైనవి. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీ గా ఉన్న ధర్మపురి అరవింద్‌ కవితను ఓడించి ఆ సీటును దక్కించుకున్నాడు. దీంతో నిజమాబాద్‌లో కారుపార్టీకి కాస్త స్పీడ్ తగ్గింది. ఇప్పుడు జరిగే ఈ ఎన్నికల్లో అధిక మొత్తంలో స్దానాలను కైవసం చేసుకుని తమ స్పీడ్‌ను పెంచుకుందామని అనుకుంటున్నవారికి కవిత ప్రచారం కలిసి వస్తుందని భావించారు.

 

 

కాని పదవి లేకుంటే నాకు పార్టీతో సంబంధం లేదనే పందాగా ప్రవర్తిస్తున్న కవిత వైఖరి కొందరిలో అసహనాన్ని కలిగిస్తున్న బాస్ కూతురు కాబట్టి బయట పెట్తలేకపోతున్నారట. ఏది ఏమైన కవిత ఇప్పుడున్న పరిస్దితుల్లో నిశబ్ధంగా ఉండటం వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉన్నదనే విషయం అర్దం అవుతుంది. కాని ఈ సమయంలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు, ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలంటే కవిత రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు.

 

 

దీన్ని బట్టి ఇప్పుడు కవిత అవసరం చాలా ఉంది. ఇలాంటి సమయంలో కవిత చురుగ్గా లేకపోవడం వల్ల నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ కేడర్‌ డీలా పడిందని నాయకులు దిగులు పడుతున్నారు. దీని ప్రభావం ఎలక్షన్స్ ముగిసినాక వచ్చే రిజల్ట్ మీద తప్పక చూపిస్తుందనుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: