రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్  వివాదంలో  కీలకంగా ఉన్న తెలుగుదేశంపార్టీ నేతలు ఇరుక్కున్నట్లేనా ? తాజాగా జగన్మోహన్ రెడ్డి మీడియా ఇచ్చిన కథనం ప్రకారం చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు చాలామంది కీలక నేతలపై కేసులు నమోదు చేయాలని సిఐడి సిఫారసు చేయబోతున్నట్లు చెప్పింది.

 

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి విషయాలు రాబట్టేందుకు చాలా పెద్ద కసరత్తే చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకించి రెవిన్యు, సిఐడి, ఇంటెలిజెన్స్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి మొత్తం వివరాలను రాబట్టింది. ప్రత్యేక బృందాలు రెవిన్యు శాఖతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖలతో మాట్లాడి చాలా వివరాలనే సేకరించింది.

 

అన్నీ కోణాల్లో వివరాలను సేకరించిన తర్వాతే ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అసెంబ్లీలో పవన్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. అసెంబ్టీలో బుగ్గన రాజేంద్రనాధరెడ్డి చెప్పిన ప్రకారం చంద్రబాబు అండ్ కో సుమారు 4070 ఎకరాలను  ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు లబ్దిపొందారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను చంద్రబాబు, మాజీ మంత్రులు, టిడిపి నేతలు కొట్టిపారేస్తున్నారనుకోండి అది వేరే సంగతి.

 

ఈ నేపధ్యంలోనే ఎందుకైన మంచిదని తాను జైలుకు వెళ్ళటానికైనా సిద్ధమంటూ  చంద్రబాబు తరచూ చేస్తున్న ప్రకటనలు అందరూ చూస్తున్నదే. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జ్యుడీషియల్ విచారణకు సిద్ధమంటూ  చంద్రబాబు, చినబాబు, మాజీ మంత్రులు పదే పదే ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ముందుగా సిఐడితో విచారణ చేయించింది. తాజాగా వివిధ సెక్షన్లపై అందరిపైనా కేసులు పెట్టి మొత్తాన్ని దర్యాప్తు చేయాలంటూ ఇన్ కమ్ ట్యాక్స్  శాఖను కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

 

ఎవరెవరి పేర్లతో టిడిపి ముఖ్యనేతలు కొనుగోలు చేశారన్న వివరాలను కూడా సిఐడి సేకరించినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే అందరిపైనా సిఐడి కేసులు నమోదు చేస్తే రాజకీయంగా భారీ కుదుపు ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: