భారతీయులకే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి షిరిడీ సాయిబాబ అంటే ఎంత భక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కలియుగంలో మనుషుల మద్యే ఉంటూ వారి పాపాలను ప్రక్షాళన చేస్తూ భక్తిభావన తీసుకు వచ్చిన మహానుభావులు సాయిబాబు. అందుకే బాబాను ప్రత్యేక్ష దైవంగా భావిస్తారు.  సాయిబాబా జన్మించింది ‘పత్రి’ లోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పర్బణి జిల్లాలోని పాథ్రీలోనే సాయిబాబా జన్మించారంటూ భావిస్తున్న అక్కడి స్థానికులు 1999లో సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు.  పత్రి సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా రేపటి నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా రేపు షిరిడీ బంద్‌కు పిలుపునిచ్చింది.

 

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ట్రస్ట్.. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం షిరిడీ గ్రామస్తులతో సమావేశం అవుతోంది. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశంకానున్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.  మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా.. షిరిడీకి వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్న భక్తులు గందరగోళంలో ఉన్నారు. వెళ్లాలా వద్దా అనే సందిగ్థంలో ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ-మహారాష్ట్ర సర్కార్ మధ్య దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.  కాగా,  కొత్త సర్కార్ వచ్చిన తర్వాతే సాయి జన్మభూమి వివాదం తెరపైకి వచ్చిందని కమలనాథులు విమర్శిస్తున్నారు.

 

షిరిడీ ప్రజలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని  జిల్లాలో పత్రి అనే ఊరు ఉంది. ఇక్కడే సాయిబాబా జన్మించారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే 1854లో 16 ఏళ్ల వయస్సులో సాయి.. షిరిడీకి వచ్చారని.. తొలుత ఓ వేపచెట్టుకింద సాయి బాబా కనిపించారని మరోవాదన ఉంది. అయితే పత్రీయే సాయినాథుని జన్మస్థలమనే విషయాన్ని గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కూడా సమ్మతించారని చెబుతున్నారు. సాయిబాబా కర్మభూమి అయితే... పత్రి జన్మభూమి అని స్పస్టం చేస్తున్నారు. మరి ఈ వివాదం భవిష్యత్ లో ఏ రూపం దాల్చబోతుందో అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: