తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,  ఉరవకొండ ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లోమీడియా ఏబిఎన్-ఆంధ్రజ్యోతితో పయ్యావుల  మాట్లాడుతూ  రాజధాని తరలింపు  ఆగాలంటే జనాలందరూ   బిజెపి వైపే చూస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుకుంటేనే రాజధాని తరలింపు ఆగుతుందని పయ్యావుల స్పష్టంగానే అభిప్రాయపడ్డారు. అంటే పయ్యావుల మాటలను బట్టి ఏమర్ధమవుతోంది ? జగన్ ప్రయత్నాలను అడ్డుకోవటంలో చంద్రబాబునాయుడు ఫెయిలయ్యారని అంగీకరిస్తున్నట్లే కదా ?

 

ఎందుకంటే రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని ఓ ఐదారు గ్రామాల్లో చంద్రబాబు రైతులను రెచ్చగొట్టి నానా గోల చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఉద్యమ విరాళాల పేరుతో  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జోలె పట్టుకుని తిరుగుతున్న విషయాన్ని చూస్తున్నదే. జగన్ కు వ్యతిరేకంగా ఇంత గోల చేస్తున్న జగన్ అయితే లెక్క చేయటం లేదు. అందుకనే జగన్ ను అడ్డుకోవటం బిజెపికి మాత్రమే సాధ్యమవుతుందని పయ్యావుల డిసైడ్ అయినట్లే అర్ధమవుతోంది.

 

అదే సమయంలో కేంద్రంలోని బిజెపి కూడా పట్టించుకోవటం లేదని చెప్పటం గమనార్హం. పెద్దన్న పాత్ర పోషించి రాజధాని తరలింపును ఆపాలని జనాలు కేంద్రప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే  రాజధాని మార్పు అన్నది కేంద్రప్రభుత్వానికి చాలా చిన్న విషయమంటూ పయ్యావుల తేల్చి చెప్పేశారు.  తన పరిధిలోని హై కోర్టు తరలింపుపైనే కేంద్రం పట్టించుకోనపుడు ఇక రాజధాని తరలింపును ఏం పట్టించుకుంటుంది ? అంటూ ఎదురు ప్రశ్నించటం గమనార్హం.

 

నిజానికి హై కోర్టు తరలింపు కేంద్రం పరిధిలోకి రాదు. ఈ విషయాన్ని తేల్చాల్సింది సుప్రింకోర్టు కొలీజియం మాత్రమే. సరే ఈ విషయం ఎలాగున్నా పయ్యావుల చెప్పినట్లుగా  రాజధాని తరలింపు విషయంలో ఇటు టిడిపి, అటు బిజెపి రెండూ ఫెయిలైనట్లుగానే అర్ధమవుతోంది.   పైగా బిజెపి, జనసేన కలియికతో రాష్ట్రానికి మేలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు టిడిపి నేత చెప్పటమే విచిత్రం. అంటే టిడిపి వల్ల ఇపుడు మేలు జరగటం లేదని జనాలు అనుకుంటున్నారని అంగీకరించటమే కదా.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: