ఇంకొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.దీంతో  ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇక  ప్రచార రథం లో అందరూ దూసుకుపోతున్నారు. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఓటర్లను ఆకర్షించడమె  లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు ప్రచార రంగంలోకి దిగారు. అయితే పురపాలక ఎన్నికల పోలింగ్ కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఓటర్లకు చేరువయ్యేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తమ పార్టీల తరఫున ప్రచారానికి కీలక నేతలు సంగారెడ్డి కి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పార్టీలో కీలక నేతలు వచ్చినప్పుడు ర్యాలీలు భారీ సభలు నిర్వహించి తగిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. 

 


 ఈ సందర్భంగా సంగరెడ్డి  మున్సిపాలిటీలో  హరీష్ రావు ప్రచార రంగంలోకి దిగారు. ఎనిమిది వార్డులు కలియతిరుగుతూ టిఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తోనే  సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీశ్ రావు  పేర్కొన్నారు. ఈ ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సి  సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణం లో ఏకంగా హరీష్ రావు ప్రచార రంగంలోకి దిగడంతో... మిగతా పార్టీలు బెంబేలెత్తుతున్నాయి . 

 


 సంగారెడ్డి పట్టణం లో అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని... ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని  పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది  అంటూ మంత్రి హరీష్ రావు ప్రచారంలో ప్రసంగించారు. తన ప్రసంగంతో ఎంతో మంది ఓటర్లను ఆకట్టుకున్నారు మంత్రి హరీష్ రావు. అయితే హరీష్ రావు ఎక్కడ అడుగుపెట్టిన అక్కడ విజయం వరిస్తుంది కాబట్టి హరీష్ రావును అదృష్టంగా భావిస్తూ ఉంటారు పార్టీ నేతలు ఈ క్రమంలోనే సంగారెడ్డి రావడంతో మిగతా పార్టీల నేతలు బయపడుతున్నారు. ఇక అన్ని పార్టీల నేతలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: