గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన  ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టిడిపి పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివిధ కారణాలతో టిడిపి పొత్తు  నుంచి తప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఎన్నో అంచనాల మధ్య ఒంటరిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. జనసేన అధినేత సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర ఓటమి పాలవడం జనసేన పార్టీ 100 స్థానాలకు పైగా పోటీ చేస్తే కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించడంతో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. 

 

 

 అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కళ్యాణ్ మాత్రం ఆంధ్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసిన పవన్ కళ్యాణ్ తాజాగా  ఏపీ బిజెపి నేతలతో చర్చించి బిజెపితో పొత్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి పోరాటం చేస్తాము  అంటు  పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే జనసేన బీజేపీ పొత్తుపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై జనసేన బీజేపీ కూటమి పోరాడేటట్లయితే  తాము బీజేపీ జనసేన పొత్తును  స్వాగతిస్తున్నామని అంటూ వెల్లడించారు చంద్రబాబు నాయుడు. 

 

 

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. సంతోషం.. అమరావతిని కొనసాగించడానికి బిజెపి జనసేన పొత్తును  ఉపయోగిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అరాచకాలకు మీరు కూడా భయపడిపోయి.. పోరాడకపోతే మాత్రం ఉపయోగం లేదు అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు. అమరావతి పరిరక్షణ కోసం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: