ఏ ఎన్నికల్లో అయినా గెలుపు సాధిస్తున్న టీఆర్ఎస్.. మున్సిపోల్స్ లో కూడా విజయం ఖాయమని నమ్ముతోంది. అయినా సరే ఎన్నికలను మాత్రం సీరియస్ గానే తీసుకుంటోంది.  రెబల్స్ ని ఒప్పిస్తూ... ప్రజలను మెప్పించి మున్పిపాలిటీలలో పాగా వేయటానికి పావులు కదుపుతోంది. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో రెబల్స్ సెగ టిఆర్ఎస్ కి తగులుతోంది. కాంగ్రెస్ ,బిజేపిలతో ఒరిగేది ఏం లేదంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. 

 

మున్సిపల్ ఎన్నికల భాద్యత అంతా ఎమ్మెల్యేలకు అప్పగించింది టీఆర్ఎస్. సీయం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ రాష్ట్ర కార్యవర్గానికి, ఎమ్మెల్యేలకు మున్సిపోల్స్ పై దిశా నిర్దేశం చేశారు. ఇటు పార్లమెంట్ నియెజకవర్గాల వారిగా పార్టీ సీనియర్ నేతలను ఇంచార్జీలుగా నియమించింది టీఆర్ఎస్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ల నుంచి నివేదికలు తెప్పించుకుంది టీఆర్ఎస్. అభ్యర్ధుల ఎంపిక నుంచి అంతా ఎమ్మెల్యేలే చూసుకోవాలని టీఆర్ఎస్ తేల్చి చెప్పింది. 

 

కేసిఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మున్సిపోల్స్ లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇటు సీఏఏ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని నేతలను ఆదేశించింది టీఆర్ఎస్. కేవలం స్థానిక అంశాలను ...అభివృద్ది నినాదంను ఓటర్ల వద్దకు తీసుకెళ్లే పనిలో ఉంది గులాబి పార్టీ. కఠినమైన మున్సిపల్ చట్టంను తీసుకువచ్చామని ...వీటితో పట్టణాలు అభివృద్ది చెందుతాయని ...పురపాలన మరింత మెరుగు అవుతోందని టీఆర్ఎస్ ప్రచారంలో ఓటర్ల దృష్టికి తీసుకెళ్తోంది. ఏ ఒక్క మున్సిపాలిటి ఓడిన మంత్రి పదవి పోతుందని కేసీఆర్ హెచ్చరించారు . దీంతో మంత్రులు మున్సిపోల్స్ ను సీరియస్ గా తీసున్నారు .

 

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్, బీజేపిలను టార్గెట్ చేస్తోంది . దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ,బిజేపిలు పట్టణాల అభివృద్దికి చేసింది ఏం లేదని విమర్శిస్తోంది గులాబీ పార్టీ .ఇటు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ లో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదని బీజేపీని ఇరుకున పెడుతోంది 10 నుంచి 15 మున్సిపాలిటిల్లో కాంగ్రెస్ -బిజేపిలు లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శిస్తోంది టిఆర్ఎస్ .

 

ఆశావహులు ఎక్కువగా ఉండడంతో మున్సిపోల్స్ లో టీఆర్ఎస్ కి రెబల్స్ సెగ తగిలింది .భారీ స్థాయిలో రెబల్స్ నామినేషన్లు ధాఖలు చేసారు. రెబల్స్ ను బుజ్జగించింది టిఆర్ఎస్. పలు మున్సిపాలిటిలు, కార్పోరేషన్లలో ఇప్పటికి పలువురు టిఆర్ఎస్ రెబల్స్ బరిలో ఉన్నారు .కొల్లాపూర్, ఇల్లెందు మున్సిపాలిటీలో ఎక్కువగా రెబల్స్ బరిలో ఉన్నారు . రెబల్స్ సమస్య 90 శాతం తీరిపోయిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. బహుళ నాయకత్వం ఉన్న పలు నియెజకవర్గాల్లో టీఆర్ఎస్ ...టీఆర్ఎస్ మద్య పోరు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

మున్సిపాలిటిలు, కార్పోరేషన్ లలో ఎక్కడికక్కడ స్థానికంగా మ్యానిఫేస్టోలు విడుదల చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది టీఆర్ఎస్ .సిరిసిల్లలో మంత్రి కేటిఆర్ అక్కడి మ్యానిఫెస్టోను రీలిజ్ చేసారు.సొంత జిల్లా లో ఉన్న సిరిసిల్ల,వేముల వాడ మున్సిపాలిటిల్లో కేటిఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు .మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తామన్న ధీమా టీఆర్ఎస్ లో వ్యక్తం అవుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: