మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో...  ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ పై టీఆర్ఎస్ కౌంటర్ వేయటంతో.. కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది. క్షేత్రస్ధాయిలో నాయకుల ప్రచారం ఒక ఎత్తయితే...ముఖ్యనాయకుల మాటలు మున్సిపల్ ఎన్నికలకు మరింత ఊపు తెస్తున్నాయి.

 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మేనిఫెస్టోను కూడా  నెట్ లో లేకుండా చేసిన దౌర్భాగ్య పరిస్ధితిలో టీఆర్ఎస్ ఉందన్నారు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య,  ఏ ఊరికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిప్తోందని...టీఆర్‌ఎస్‌ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రం కనిపించడం లేదన్నారు. 57 ఏళ్లకే ఫించన్ ఇస్తామని మాటిచ్చి... ఏడాదిగా ఎందుకు అమలు చేయటం లేదన్నారు.

 

తెలంగాణ అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... సీఎంకు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు తప్ప రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కనిపించడం లేదన్నారు. ప్రగతి భవన్ కట్టడానికి డబ్బులున్నాయి కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మాత్రం నిధులు లేవా? అంటూ ప్రశ్నించారు.

 

కొడంగల్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీర్ లపై విమర్శల ఎక్కుపెట్టిన రేవంత్‌ రెడ్డి... భూ కేటాయింపులు, ఐటీ హబ్ ల పేరిట కోట్ల ఆవినీతి జరిగిందన్నారు. టీఆర్ఎస్ నీతివంతమైన పార్టీ అయితే... ఎన్నికల ఫండ్ వివరాలు బయటపెట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో నాయకుల మాటల కారణంగా రాజకీయ పార్టీల మధ్య విమర్శల వేడి పెరుగుతోంది. అధికార, పత్రిపక్షాల మద్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎవరికి వారు ఆధిపత్యం సాధించేందుకు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: