ఏపీ రాజకీయాల్లో జనసేన-బీజేపీల మధ్య సరికొత్త పొత్తు పొడిచింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. విజయవాడలోని హోటల్‌లో సమావేశమైన నేతలు.. మూడు గంటల పాటూ పొత్తులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

 

అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను గతం నుంచి పరిశీలిస్తే ఇక్కడ రెండే పక్షాలు ప్రధానంగా పోటీ పాడడం, ఏదో ఒక పక్షానికి ప్రజలు మద్దతు పూర్తిగా ఉంటూ వారికే అధికారం కట్టబెట్టడం జరిగిపోతూ వస్తోంది.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ నుంచి పరిశీలించినా ఏపీ రాజకీయాల్లో మూడో కూటమిని జనం ఆదరించలేదు.

 

బిజెపి కి ఎపి లో ఎదిగే అవకాశం లభిస్తున్న సమయంలో టిడిపి ఆవిర్భావం పార్టీ ఆశలపై పూర్తిగా నీళ్ళు చల్లేసింది. ఇక పోతే ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి లాభమని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నామని చెప్పారు.

 

ఇక ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ ఆశపడుతోంది.అయితే బీజేపీ ఆశలు ఎంతవరకు తీరుతాయో అనేది ప్రశ్నగా మారింది. కానీ మనం ఏపి రాజకీయాలను తీక్షణంగా పరిశీలిస్తే ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామజిక వర్గాల మధ్యే పోరు జరుగుతుంది.

 

ఎందుకంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, జనసేన పార్టీలకు బలం లేదు.కానీ విషయంలో టీడీపీ, వైసీపీ లు విషయంలో బాగా బలంగా ఉన్నాయి. ఇప్పుడు మూడో కూటమి బలపడాలి అంటే రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ బాగా బలహీనపడాలి.అది సాధ్యమయ్యే పనేనా అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.ఇటువంటి సమయంలో జనసేన-బీజేపి పొత్తుని జనం అంగీకరిస్తారా అంటే కష్టం అనే చెప్పలి.

మరింత సమాచారం తెలుసుకోండి: