దేశంలో నివశించే వారికి ఆధార్ కార్డు ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డును ఉపయోగించి ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ గా పని చేయటంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా ఆధార్ కార్డు ద్వారా పొందవచ్చు. ఆధార్ కార్డు ఉంటే మాత్రమే దేశంలో, రాష్ట్రంలో అందే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. 
 
ఆధార్ కార్డు నంబర్ ను ఖచ్చితంగా కొన్ని కార్డులకు లింక్ చేయించుకోవటం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చు. లింక్ చేయించుకోకపోతే కొన్ని ప్రయోజనాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధార్ నంబర్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయించుకోవాలి. ఆధార్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయించుకోవటం వలన పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా ఖాతాకే పొందే అవకాశం ఉంటుంది. 
 
పాన్ కార్డుతో ఆధార్ నంబర్ ను ఖచ్చితంగా లింక్ చేయించుకోవాలి. కేంద్రం నల్లధనాన్ని అరికట్టటం కొరకు, ఫేక్ పాన్ నంబర్లను తొలగించేందుకు, పన్ను ఎగవేతదారులను కనుగొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబర్ ను ఓటర్ ఐడీ కార్డుతో కూడా లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓటర్ కార్డును ఆధార్ నంబర్ తో లింక్ చేయటం ద్వారా దొంగ ఓటర్ కార్డులు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండవు. 
 
ఆధార్ నంబర్ ను ఎల్పీజీ అకౌంట్ తో కూడా లింక్ చేయించుకోవాలి. ఎల్పీజీ అకౌంట్ తో లింక్ చేయించుకోవటం వలన అదే ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటే సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఆధార్ నంబర్ ను రేషన్ కార్డుతో కూడా లింక్ చేసుకోవాలి. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్ ప్రయోజనాలు రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ ను అనుసంధానం చేయడం వలన లభిస్తాయి. 
 
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్ ద్వారా రేషన్ సరుకులు ఏ రాష్టంలోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ నంబర్ తీసుకోవాలంటే ఆధార్ నంబర్ కావాల్సిందే. ఆధార్ నంబర్ తో మొబైల్ నంబర్ ను లింక్ చేయటం వలన వ్యక్తి యొక్క ఐడెంటిటీ తెలుస్తుంది. అందువలన పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: