ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాజధాని రగడ రగులుతూనే ఉన్న  విషయం తెలిసిందే. అయితే రాజధానిని తరలించ వద్దు అని టీడీపీ నేతలు అంటుంటే...  లేదు రాజధాని తరలిస్తేనే  రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు... ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతి లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమరావతి రైతులందరు  రోడ్ల పైకి చేరి.. తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని తమ భవిష్యత్తు తరాలు బాగుంటాయని కలలు కన్నామని...  కానీ ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిస్తే మా భవిష్యత్తు ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఆందోళన చేపడుతున్నారు అమరావతి రైతులు. 

 

 

 వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజధానిలో రగులుతున్న నిరసనల్లో  కేవలం రైతులకే కాకుండా మహిళలు కూడా రోడ్లపైకి చేరి  నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు  జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో మహిళలు నిరసన తెలపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాజధాని తరలించవద్దని అంటూ  అమరావతి ప్రాంత మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఇప్పటికే నెల రోజులు దాటి పోయాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 రోడ్లపైకి వచ్చి మహిళలు ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని... అమరావతిలో మగ వాళ్ళు లేరా అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రోజా వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. మగతనం గురించి మాట్లాడవద్దని రోజాకు హితవుపలికారు దివ్యవాణి. మేము కూడా మీలాగే మాట్లాడగలమని అయితే మాకు సంస్కారం ఉంది అంటూ విమర్శించారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి చెల్లి రోడ్లమీద తిరిగి ప్రచారం చేయలేదా వాళ్లు మహిళలు అన్న విషయం రోజాకు గుర్తులేదా తెలియదా అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: