తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అరుదైన గుర్తింపును మరియు గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే క్రియాశీలక నగరాల్లో మొదటి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. ప్రముఖ స్థిరాస్తి అధ్యయనం సంస్థ ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరానికిగాను 130 నగరాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచినట్టు ఈ సంస్థ వెల్లడించింది. 
 
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కేటీయార్ సిటీ మూమెంటం ఇండెక్స్ - 2020 జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన 7నగరాలే మొదటి 20 స్థానాలలో ఉండటం గమనార్హం. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా 5వ స్థానంలో చెన్నై, 7వ స్థానంలో ఢిల్లీ, 12వ స్థానంలో పూణె, 16వ స్థానంలో కోల్ కతా, 20వ స్థానంలో ముంబాయి ఈ జాబితాలో ఉండటం గమనార్హం. 
 
కేటీయార్ మాట్లాడుతూ మూడేళ్లలో హైదరాబాద్ రెండోసారి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇన్నోవేషన్ ఎకానమీలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోందని ఈరోజు హైదరాబాద్ లో టీఎస్ ఐపాస్ తో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. సోషియో ఎకనామిక్ ఇండెక్స్ లోను హైదరాబాద్ నగరం టాప్ లో నిలిచిందని అన్నారు. 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న జనాభా ప్రొడక్టివ్ రంగంలో పని చేస్తోందని కేటీయార్ అన్నారు. 
 
గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ సామాజిక ఆర్థిక అంశాలు మరియు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంశాల ప్రాతిపదికన హైదరాబాద్ కు ఈ గుర్తింపు దక్కినట్టు తెలిపారు. టాప్ 20 లో దేశానికి చెందిన ఏడు నగరాలు దేశం ఆర్థిక మందగమనంలో కొనసాగుతున్నా స్థానాలను సంపాదించుకోవడం గమనార్హం. జీడీపీ వృద్ధి, విమానాశ్రయ ప్రయాణికుల సంఖ్య పెరుగుదల మరియు రిటైల్ అమ్మకాల పెరుగుదల పెరగటం వలన హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచిందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: