ఈనెల 22 వ తేదీన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, ప్రధానంగా తెరాస, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ రసవత్తరంగా సాగబోతున్నది. ఎలాగైనా సరే విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి.  పార్టీలు బలంగా ఉన్న అన్ని చోట్ల అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చారు.  అయితే, ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  ఎందుకంటే, ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 

టికెట్ వస్తుందని ఆశించిన వ్యక్తులు టికెట్స్ దొరక్కపోవడంతో భంగపడి ఇబ్బందులు పడుతున్నారు.  దాని నుంచి బయటపడేందుకు అనేక తంటాలు పడుతున్నారు.  గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతూనే రెబల్స్ ను బుజ్జగించే పనిలో ఉన్నారు.  అయితే, రెబల్స్ ససేమిరా అనడంతో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.  చైర్ పర్సన్ గా తప్పకుండా అవకాశం వస్తుందని భావించిన వ్యక్తులకు కనీసం వార్డు మెంబర్ గా కూడా అవకాశం దక్కకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.  

 

స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.  స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వ్యక్తులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించుకుంటున్నారు.  ఖమ్మం జిల్లాలోని ఇల్లేందు, కొత్తగూడెంలో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నది.  ఈ రెండు చోట్ల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  అదే విధంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది.  కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఫారాలు వస్తాయని ఆశించిన వ్యక్తులు అవి దక్కకపోవడంతో రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు.  

 

అదే విధంగా  నిజామాబాద్ లో కూడా బీజేపీకి రెబల్స్ బెడద ఉన్నది. దీంతో అక్కడి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.  ఇది ఆ పార్టీకి తీరని దెబ్బగా కనిపిస్తోంది.  వికారాబాద్, తాండూర్, కొడంగల్, ఆదిలాబాద్ 16 వార్డుల్లోనూ, అలానే రామగుండం లోను రెబల్స్ బెడద ఎక్కువగా ఉన్నది.  దీని నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  మరి ఏం జరుగుతుందో చూదాం.  ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది త్వరలోనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: