మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా వినియోగించే వంట పదార్థం ఏదైనా ఉందటే అది కందిపప్పే. పేదవాడి దగ్గర నుంచి ధనికుడు వరకు వారు చేసే భోజనంలో పప్పు మాత్రం తప్పని సరిగా ఉంటుంది. ఇక ఏదైనా శుభకార్యాల్లో కూడా పప్పు వంటకం సహజంగా ఉంటుంది. కేవలం పప్పుతో రుచే కాకుండా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. కందిపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినని వారిలో కండరాల ఎదుగుదల లోపాలు లేకుండా ఉండాలంటే కందిపప్పు తినాల్సిందే.

 

ఇంకా కందిపప్పులో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు, పిండి పదార్థాలు, స్వల్పంగా కొవ్వులతో పాటు విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, వంటి విటమిన్లు ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

 

అయితే ఈ విధంగా ఖనిజ లవణాలు ఉండటం వల్ల కేంద్రం మంత్రి కూడా కందిపప్పుని తినమని రికమండ్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ కందిపప్పుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఓ ట్వీట్ చేశారు. మనందరికీ కందిపప్పు అంటే ఇష్టమే అంటూ... రోజువారీ శరీరానికి కావాల్సిన ఫైబర్‌ను కప్పులో నాలుగో వంతు కందిపప్పు ఇస్తుందని ఆయన వివరించారు.

 

అలాగే కందిపప్పు వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుంది, గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుందని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ కందిపప్పు తినాలనీ ఆయన కోరుతున్నారు. గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని, కాబట్టి కందిపప్పుని అందరూ తమ వంటకాల్లో విరివిగా వాడాలని, తద్వారా మంచి ఆరోగ్యం పొందాలని ఆయన చెబుతున్నారు.

 

అయితే ఆయన చెప్పినట్లే కాకుండా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కందిపప్పు కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇందులోని ఐరన్, విటమిన్‌–సి రక్తహీనతను దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి తగిన శక్తినిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉండే కందిపప్పుని ఎవరు తినకుండా ఉంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: