అమరావతి ప్రాంతంలో టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో జగన్ ప్రభుత్వం పై ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం అందరికి తెలిసినవే. అమరావతి ప్రాంతం నుండి రాజధానిని తరలించే కార్యక్రమం వైయస్ జగన్ చేస్తున్నారని ఆ ప్రాంతంలో ఉన్న రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ జోలె పట్టి నిరసనలు తెలుపుతున్న చంద్రబాబు పై బాలయ్య బాబు తిరుగుబాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీలో మరియు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళితే గత నెలరోజులకు పైగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు చేస్తున్నా గాని ఇతర ప్రాంతాల నుండి సరైన సానుకూలత రాకపోవడంతో వియ్యంకుడు నందమూరి బాలయ్య అనే రంగంలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ అమరావతి ప్రాంతంలో షెడ్యూల్డ్ ఊరు మొత్తం ఖరారు కావడంతో బాలకృష్ణ కి సంబంధించి అమరావతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం మీడియాకు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ పెద్దలు.

 

ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుపై బాలకృష్ణ తిరుగుబాటు చేసే విధంగా మీడియాకు ఇచ్చిన అమరావతి టూర్ షెడ్యూల్ ప్రకారం అమరావతి పర్యటనలో 16 నుంచి 18 వరకు చేయాలని చంద్రబాబు ఇచ్చిన డేట్ లకు బాలకృష్ణ ససేమిరా అన్నట్లు తెలుగుదేశం పార్టీలో వినబడుతున్న టాక్. చంద్రబాబు 16 నుంచి 18 వరకు బాలకృష్ణ పర్యటన అమరావతి ప్రాంతంలో తుళ్లూరు.. మందడం.. నిడమర్రు.. పెదపరిమి.. రాయపూడి.. పెనుమాక.. ఉండవల్లి.. కృష్ణాయపాలెం ప్రాంతాల్లో బాలకృష్ణ చేత భారీ ర్యాలీ నిర్వహించాలని భావించారు.

 

ఆఖరి నిమిషంలో బాలకృష్ణ హ్యాండ్ ఇవ్వడంతో సడన్ గా అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవటంతో చంద్రబాబు ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం. అయితే బాలకృష్ణ అమరావతి పర్యటనలో టూర్ క్యాన్సిల్ చేసుకోడానికి గల కారణాలలో ఒక కారణం ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీ వంటివి నిర్వహించకుండా ఉండాలని వైయస్ జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన ఉండటంతో ఈ విషయంలో వెనక్కి తగ్గాలని అసెంబ్లీ సమావేశాలు అయ్యాక రాజధాని ప్రాంతాలలో పర్యటించడానికి బాలకృష్ణ రెడీ అయినట్లు దీనికి చంద్రబాబు పర్మిషన్ కూడా అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా బాలకృష్ణ తాజా పర్యటన క్యాన్సిల్ చేసుకోవడం వెనుక ఖంగుతిన్నట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: