తొలిసారిగా కేటీఆర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆయన తండ్రి కెసిఆర్ సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేస్తున్న అంటూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో కేటీఆర్ అక్కడే ఆత్మ సాక్షిగా ప్రమాణస్వీకారం చేస్తున్న అని తనలోని విభిన్నమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు. ఇటువంటి నేపథ్యంలో కుటుంబ సమేతంగా కేటీఆర్ తిరుమల తిరుపతి సందర్శించిన నేపథ్యంలో ఇటీవల కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న కామెంట్లు వార్తలు వస్తున్న తరుణంలో సడన్ గా కేటీఆర్ భార్య పిల్లలతో తిరుమల తిరుపతి పర్యటన చేపట్టడంతో మీడియా దృష్టి మొత్తం కేటీఆర్ పై పడింది.

 

ఈ సందర్భంగా మీడియా విలేఖరి ఒకరు రాబోయే రోజుల్లో తెలంగాణలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీరు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి దాని పై మీ కామెంట్ అని ప్రశ్నించారు..దీంతో కేటీఆర్ స్పందిస్తూ..``అదంతా మీడియాసృష్టే. మీరే రాస్తారు.. మీరే అడుగుతారు. అలాంటిదేం లేదు.`` అని తెలిపారు. మంత్రులు కూడా మాట్లాడుతున్నారని మ‌రింత రెట్టించ‌గా...``ఎవరూ.. నేరుగా మాట్లాడలేదు. ఏదో విషయం మీద ప్రెస్‌మీట్‌ పెడితే మీరే అడుగుతున్నరు. వారు చెప్పిన సమాధానంతో మీరు స్టోరీలు చేసుకుంటున్నరు.

 

తెలంగాణలో ప్రతిపక్షం లేదు. మసాల న్యూస్‌ లేదు. అందుకే మీరు ఏదో ఒకటి సృష్టించి మసాలా తయారుచేస్తున్నరు.`` అంటూ మీడియాపై పంచులు వేశారు. నాస్తికుడైన మీరు ఇటీవల తిరుమల వెళ్ళడం ఈ చర్చను మరింత పెంచింది? అని స‌ద‌రు పాత్రికేయుడు లాజిక్‌తో ప్ర‌శ్నించ‌గా...``నాకు కుటుంబం ఉంది. భార్యా, పిల్లల నుండి ప్రెషర్‌ ఉంటది. ఒక్కోసారి వినాలి కదా. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు.`` తన భార్య ఒత్తిడి మేరకు తిరుమల తిరుపతి పర్యటన చేపట్టినట్లు కేటీఆర్ ఇండైరెక్టుగా భార్య మాట వినాలి కదా అన్నట్టుగా మనసులో మాట బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: