పాపం చాలామంది టిడిపి నేతల ఆర్ధికమూలాలపై జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద దెబ్బే కొట్టినట్లు అర్ధమవుతోంది. చంద్రబాబునాయుడు హయాంలో  భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన భూముల ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో ఒక్కోరికి వందల కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని సోషల్ మీడియాలో కొన్ని వివరాలు వైరల్ గా మారింది.  ఇలా బయటపడిన వివరాల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాటా రూ. 500 కోట్లని ప్రచారం జరుగుతోంది.

 

చంద్రబాబు అధికారంలోకి రాగానే  రాజధాని అమరావతి ప్రాంతంలో  చంద్రబాబుతో పాటు  పార్టీలోని కీలక నేతలు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్  పద్దతిలో భూములు కొన్నట్లు వైసిపి ఆరోపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నపట్టి నుండి చేస్తున్న ఆరోపణలకు అధికారంలోకి రాగానే  ఒక్కో ఆధారాన్ని బయటపెడుతోంది. ఇలా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వాళ్ళల్లో ప్రత్తిపాటి కూడా ఉన్నారని ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

 

ప్రభుత్వ వాదనకు మద్దతుగా తాజాగా ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంతకీ విషయం ఏమిటంటే ప్రత్తిపాటి సుమారు రూ. 125 కోట్లు పెట్టుబడి పెట్టారట.  ఆయనకు సంబంధించిన రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల పేరు మీద బ్యాంకుల్లో లోన్లు తీసుకుని మరీ భూములు కొన్నారట. కొన్న భూముల్లో ఎక్కువగా అసైన్డ్ భూములే ఉన్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.  సరే మొదటి నుండి ప్రత్తిపాటి తనపై వస్తున్న ఆరోపణలను కొట్టేస్తున్నారు లేండి.

 

 2014, జూన్ 8వ తేదీన ప్రత్తిపాటి మంత్రిగా ప్రమాణ స్వీకారం  చేశారు. ప్రత్తిపాటి పిల్లలు రియల్ ఎస్టేట్ కంపెనీలో అడిషినల్ డైరెక్టర్లుగా జూన్ 16వ తేదీన చేరారట. అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 8 రోజులకు పిల్లలు ఓ కంపెనీలో చేరారు. రెండు  కంపెనీలు కూడా 2014, జూన్-2014, డిసెంబర్ మధ్య పెద్ద ఎత్తున భూములు కొన్నారనేది ఆరోపణ. భూములు కొనేందుకు ప్రత్తిపాటి ఆంధ్రాబ్యాంకు, స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యంక్ ల నుండి అప్పులు తీసుకున్నారట.  మరి ఈ వివరాలు ఎంత వరకూ నిజమన్న విషయాన్ని ప్రభుత్వమే చెప్పాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: