గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం జగన్ చిరంజీవిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత చిరంజీవి జగన్ తో సఖ్యతగానే మెలుగుతున్నారు. సైరా సినిమా విడుదలైన సమయంలో చిరంజీవి తన సతీమణితో కలిసి సీఎం జగన్ దంపతులను సైరా సినిమాను వీక్షించాలని కోరిన విషయం తెలిసిందే. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి కూడా చిరంజీవి తన మద్దతును ప్రకటించారు. 
 
మరోవైపు చిరంజీవి కూడా రాజ్యసభకు వెళ్లాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి మదిలో రాజ్యసభకు వెళ్లానే కోరిక ఉండటం వలనే జగన్ తో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్నాడని తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలిస్తానని చిరంజీవి జగన్ కు హామీ ఇచ్చారని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
చిరంజీవి వైజాగ్ లో భూములు కొనుగోలు చేశాడని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి సహాయం కూడా భూముల కొనుగోలు కోసం తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది. సీఎం జగన్ కూడా చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే పరోక్షంగా జనసేన పార్టీని దెబ్బ తీసినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
 
చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా కాపు సామాజిక వర్గం వైసీపీ పార్టీకి అండగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సీటుకు ఇటు చిరంజీవి బలంగా ప్రయత్నిస్తున్నట్టు, అటు జగన్ కూడా చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు సుముఖంగా ఉండటంతో చిరంజీవి ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ చిరంజీవిని రాజ్యసభకు పంపితే నైతికంగా జనసేన పార్టీని కూడా దెబ్బ తీసినట్టు అవుతుందని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: