రాజకీయాల్లో ఉన్న నాయకుల మనసులు రంగుల కాగితం లాంటివి. ఈ రంగు ఎప్పుడు వెలిసి పోతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులతో బాంచన్ కాళ్లు మొక్కుతా అంటూ పిల్లిలా ఉంటేనే రాజకీయ భవిష్యత్తుకు మనుగడ, లేదంటే రాజకీయాల్లో అసలు భవిష్యత్తే లేకుండా చేస్తారని బయట వినికిడి. ఇకపోతే తెలంగాణ ప్రజలు అతిగా ఆశించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్నారు. కానీ తెలంగాణ వచ్చాక ఏం జరుగుతుందో అనే విషయం విద్యావంతులుగా వర్ధిల్లుతున్న వారికి ప్రత్యేకించి వివరించవలసిన అవసరం లేదు.

 

 

ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణ మున్సిపాలిటి ఎలక్షన్స్ జోరు యమ స్పీడ్‌గా సాగుతుంది. ప్రచారంలో కూడా టీఆర్ఎస్ నాయకులు ఎక్కడా తగ్గడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడున్న పరిస్దితుల్లో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్దితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనట్లుగా ఉందంటున్నారు కొందరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్‌, టీఆర్ఎస్ అధిష్టానం పై  రాజేందర్ త‌ర‌చూ రుస‌రుస‌లాడుతుండ‌డంతో పాటు గులాబీ జెండాకు తాను ఓన‌రే అని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించాడు. అంతే కాకుండా కొన్ని రోజుల క్రితం తనకు కొట్లాడటం తెలుసు కానీ.. దొంగ దెబ్బతీయడం రాదంటూ తన మాటలతో అలజడి సృష్టించాడు..

 

 

ఇకపోతే గత కొంతకాలంగా సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ మధ్య అభిప్రాయ విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా చివరి నిమిషంలో ఈటల రాజేందర్ పేరును చేర్చారు. అయితే ఇదివరకు కేటాయించిన ఆర్థికశాఖ కాకుండా వైద్యరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించడంతో గులాభి బాస్‌కు రాజేందర్‌కు మధ్య ఏదో జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం అని కొందరి వాదనట.

 

 

ఇకపోతే ఇలాంటి పరిస్దితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ రావడం ఇప్పుడు రాజేందర్‌కు అగ్నిపరీక్షలా తయారైందని రాజకీయ వర్గాల్లో గుసగుసలట. ఇక ఒకప్పుడు ఉన్నంత చురుగ్గా ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు లేడనే వాదన కూడా తెరపైకి వస్తుంది మరి ఇలాంటి సంక్లిష్ట పరిస్దితుల్లో తన హయామంలో హుజూరాబాద్‌, జ‌మ్మికుంటలో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్‌లో విజయాన్ని అందించి టీఆర్ఎస్ పార్టీ పరువు నిలుపుతారో లేక తేడావచ్చి పెద్దబాస్ ముందు మరింత చులకన అవుతారో అని ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్దితి ఈ మంత్రికి గడ్దుకాలం అని చెప్పవచ్చూ.

మరింత సమాచారం తెలుసుకోండి: