మరికొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలని  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . ఇక అన్ని పార్టీలు ప్రచార రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాయి.  ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్థానంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోకూడదు అని టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలందరికీ దిశా నిర్దేశం చేసారు. ఇక అటు కాంగ్రెస్ బిజెపి పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే... మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బిజెపి పార్టీ భావిస్తోంది. 

 

 

 దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.  అన్ని పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక అన్ని పార్టీల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అందరూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున పార్టీ లోని ముఖ్య నేతలందరూ ప్రచార రంగంలోకి దిగి తమ  ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న  విషయం తెలిసిందే. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుండే  కాకుండా బిజెపి కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా పార్టీ ముఖ్య నేతలందరూ ప్రచార రంగంలోకి దిగి మున్సిపల్ ఎన్నికల్లో  తమ తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే ప్రచారం నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ రాష్ట్రానికి తర్వాత ముఖ్యమంత్రిగా ఒకవేళ తాను అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటూ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2024 లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి.. బీజేపీ హైకమాండ్ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చు అంటూ తెలిపారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీ చేతిలో టిఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారిపోయిందని.. టిఆర్ఎస్ పార్టీ సిగ్గులేకుండా ఎంఐఎం  పార్టీతో కలిసి పోయింది అంటు  విమర్శించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: