ఒక సినిమా భారీగా విడుదలైంది. సినిమా హాల్లో జనం మాత్రం అంతంత మాత్రమే కలెక్షన్స్ కూడా పెద్దగా లేవు. కానీ ఆ చిత్రయూనిట్ మాత్రం తమ సినిమా అదిరిపోయింది. ఈ బొమ్మ బ్లాక్ బస్టరే అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇదే జరుగుతుందని సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. ప్రపంచ గర్వించదగ్గ అభివృద్ధి జరిగిందని చెప్పుకునే నాయకులు తాము కొత్తగా చేసిన అభివృద్ధి ఏంటో ఒక సారి సామాన్య ప్రజలకు వివరిస్తే బాగుంటుందనే అభిప్రాయాం లోలోన మనసును తినేస్తున్న బలవంతంగా అణుచుకుంటున్నాడట.

 

 

ఇకపోతే అభివృద్దిమాట అటుంచితే ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తున్నాయి. నాయకులు గెలుస్తున్నారు. ఇందుకు గాను డబ్బులు, బిర్యాని పొట్లాలు, మందు సీసాలు ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఈ ఎలక్షన్ల సమయంలో ఓటర్లు కింగ్‌లు, అవి ముగిసాక పెద్ద బిచ్చగాళ్లు అన్నవిషయాన్ని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదని కొందరు వేదన చెందుతున్నారట. ఇకపోతే కొన్ని చోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారిని మభ్య పెడుతూ, అభ్యర్ధులు ప్రచారం చేస్తున్నారట. ఈ విషయంలో దుమారం లేస్తున్న ఎవరు పట్టించుకునే వారు లేరని కొందరి వాదన.

 

 

ఒకప్పుడు చేసిన అభివృద్ధ్ చెప్పుకుని ఓట్లు అడుక్కునే వారు. కాని ఇప్పుడు ఇదిగో ఇలా ‘కారు గుర్తుకు ఓటెయ్యి మల్ల.. ఎయ్యకపోతే నీ రెండు వేలు రావు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ వృద్ధురాలిని ఓటు అడుగుతూ ఒక ఎమ్మెల్యే ఆదివారం చేసిన వ్యాఖ్యలివి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిపింగ్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇకపోతే ఇలా టీఆర్​ఎస్​ క్యాండిడేట్లు ఎలక్షన్స్​ కోడ్​కు విరుద్ధంగా నవ్వుతూనే ఓటర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాకుండా గెలవాలనే అధికార దాహంతో ప్రచారాలు సాగిస్తున్నారే తప్పా, ప్రజా సమస్యలపై తాజా ఎన్నికల్లో ఏ లీడరూ, పెదవి విప్పడం లేదు. ప్రస్తావించడం లేదు.

 

 

కరీంనగర్​లో మానేరు రివర్​ ఫ్రంట్​, అగ్రికల్చర్​ బేస్డ్​ ఇండస్ట్రీల ఏర్పాటు హామీ హామీలాగే మిగిలిపోయింది. ప్రస్తుతం అటు అధికారపార్టీ క్యాండిడేట్లుగానీ, ఇటు అపోజిషన్​ లీడర్స్​గానీ వీటిని ప్రస్తావించడం లేదు. నిజామాబాద్​, ఆదిలాబాద్​, మంచిర్యాల సహా అనేక పట్టణాల్లో రైల్వే ఓవర్​ బ్రిడ్జిలు లేక ట్రాఫిక్​ సమస్య తలెత్తి, జనం పడరాని పాట్లు పడుతున్నారు. మంచిర్యాల బైపాస్​కు నేటికీ మోక్షం కలగడం లేదు. ఇలా ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో తరహా సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఏ లీడరూ తమ ప్రచారంలో ప్రస్తావించక పోవడం దురదృష్టకరం.

 

 

ఇకపోతే అధికార పార్టీ క్యాండిడేట్లు ‘నీకు పింఛన్​ ఇస్తున్నాం కాబట్టి ఓటేయండి. మీకు కల్యాణ లక్ష్మి వచ్చింది కాబట్టి ఓటేయండి..’ అని ప్రచారం చేస్తుంటే , విపక్ష లీడర్లు వాళ్లపై వ్యక్తిగత విమర్శలకే  పరిమితమవుతున్నారు. ఇదే కాకుండా మరి కొందరు ‘మీరు ఓటు ఎవలకేసినా నాకు తెలుస్తది.. లోపల వేసింది సారుకు తెల్వదనుకునేరు.. తర్వాత పొరపాటైందన్నా లాభం లేదు.. మీ జీవితాలు నాశనమైతయ్’  అంటూ ఈ మంత్రి ఓటర్లను బెదిరించడం, మరవకముందే మధిర మున్సిపాలిటీలో ఆదివారం మరో నాయకుడు ​ప్రచారంలో ఇలాంటి కామెంట్లే చేశాట. విపక్షాలకు ఓటేస్తే మురిగి పోయినట్లేననీ, ఆ పార్టీలను గెలిపిస్తే తాము నిధులు ఇవ్వబోమనే ధోరణిలో మాట్లాడారట... నిజానికి మనం తెల్లదొరల పాలనలో ఉన్నామా, ఇంకా స్వేచ్చను తెచ్చుకోలేదా అనే భ్రమను కలిగిస్తున్నాయట ఈనాటి ప్రచారాలను చూస్తుంటే...

మరింత సమాచారం తెలుసుకోండి: