ఈ బొమ్మలో ఏముంది అని రూ. 471 కోట్లు విలువ? ఇలా అన్నాను అని.. కళకు విలువ ఇవ్వనట్టు అర్థం కాదు.. మీరే చెప్పండి. ఈ పెయింటింగ్ ఏమైనా అందం ఉందా? మళ్ళి మళ్ళి చూడాలి అని అనిపించే పెయింటింగ్ అందులో ఉందా? ఈ పెయింటింగ్ ని గోడకు తగిలించడమే ఎక్కువ అలాంటిది ఆ పెయింటింగ్ కి 471 కోట్ల రూపాయిల?.. ఇది నాలాంటి మధ్యతరగతి వారి మదిలో మాట..! కానీ ఆ పెయింటింగ్ విలువ నిజంగానే 471 కోట్లు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటలీలో రిచ్చీ ఆడీ అనే గ్యాలరీలో గుస్తవ్ క్లిమ్ట్ అనే ఆర్టిస్ట్‌ వేసిన ఆర్ట్ వర్క్ 1997 ఫిబ్రవరిలో మిస్సైంది. అయితే ఆ ఆర్ట్ వర్క్ దాదాపు 22ఏళ్ళ తర్వాత మళ్ళి రిచ్చీ ఆడీ గ్యాలరీలో దొరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ యువతి ఎడమ పక్కకు చూస్తూ.. పచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో ఉండే ఈ ఆర్ట్ వర్క్ అక్కడే పని చేసే ఓ వ్యక్తికి ఈ ఫోటో చెత్తకుప్పలో దొరికింది. 

 

ఈ విషయాన్ని ఆ క్లినర్ ఏ చెప్తున్నాడు. ఆకులను క్లీన్ చేసే సమయంలో.. గ్యాలరీ బయటి గోడల మధ్య ఒక చిన్న తలుపు కనిపించిందని.. తీసి చూస్తే ఓ ప్లాస్టిక్ బ్యాగ్ ఉన్నట్టు ఆ క్లీనర్ పేర్కొన్నాడు. కాగా ఈ గుస్తవ్ ఆర్ట్ వర్క్‌ విలువ ఒక్క రూపాయి.. రెండు రూపాయిలు కాదు.. ఆలా అని వందలు కాదు వేలు కాదు.. లక్షలు కూడా కాదు.. ఈ ఆర్ట్ విలువ ఏకంగా కోట్ల రూపాయిల విలువ. 

 

అది ఒక కోటి రెండు కోట్లు కాదు.. ఏకంగా ఈ ఆర్ట్ వర్క్ ధర ఏకంగా 51 మిలియన్ పౌండ్లు.. మన భారత్ కరెన్సీ లో ఏకంగా 471 కోట్ల రూపాయిలు. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతుంది. ఆ బొమ్మలో ఏముంది అని అంత కాస్టలీ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 

 

అయితే ఈ ఆర్ట్ వర్క్‌ను గుస్తవ్ 1917లో వేశారు.. ఎంత పాత పెయింటిగ్ అయినా అంత ఖరీదు ? ఎలా ? మన తెలుగులో ఊపిరి అనే చిత్రంలో కార్తీ ఆ రంగు ఈ రంగు కలిపి వేస్తే దాన్ని ప్రకాష్ రాజ్ రెండు లక్షల రూపాయలకు కొన్నట్టు ఈ పెయింటింగ్ కూడా ఉందని.. నాలాంటి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మరి మీరు ఏం అంటారు? ఈ పెయింటింగ్ కి 471 కోట్లు పెట్టె విలువ ఉంది అంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: