ఒక అబద్ధం నిజం అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఆ భ్రమనే మోసం అవుతుంది.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పక్రియ ఇదేనని చెప్పకనే చెప్పవచ్చు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత జరిగిన ఆభివృద్ధి, జరుగుతున్న అభివృద్ధిని చూసుకుంటే, ఏ రాష్ట్ర నేతలు అయినా వారి పదవులు కాపాడుకోవడానికే గాని ప్రజా సంక్షేమం పట్టించుకోవడం లేదు అనే విషయం ప్రజల్లో బాగా నాటుకుందట..

 

 

ఒక వేళ మేము ప్రజలకోసమే ఆలోచిస్తున్నాం అని అంటే ఈరోజు వెలుగు చూస్తున్న అక్రమాల సంగతేంటి. అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజుననే భ్రమలో ఎన్నో అక్రమాలకు పాల్పడతారు. అదికాస్త పోయినాక, మరొకరు అధికారంలోకి వచ్చి, ఆ ముందు పాలించిన నాయకుడి లెక్కలు బయటకు తీస్తాడు. దీని వల్ల అప్పటి వరకు ఉన్న గుర్తింపు, అతని అవినీతి బయటపడటంతో ఒక్క సారిగా మసిబారుతుంది. అచ్చంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతుంది.

 

 

రాష్ట్రాం విడిపోయాక లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని నేను ఎంతగా అభివృద్ధి చేసానంటే, నా అభివృద్ధి గురించి విదేశీయులను అడుగు అంటున్న, చంద్రబాబు మాటలను ఇప్పుడున్న స్వదేశీ ఏపీ ప్రజలు నమ్మడం లేదు. ఇకపోతే ఏపీ అభివృద్ధి విషయంలో ఏపీ మున్సిపల్ శాఖ మాజీ మంత్రి నారాయణ,  ప్రముఖ పాత్ర పోషించాడని చెబుతున్నారు. అంతే కాకుండా రాజధాని విషయంలో నారాయణ విదేశీ పర్యటనలు చేసి అక్కడి నుండి నమూనాలు తెచ్చారు. ఇలా ప్రతి విషయంలో బాబుకు తోడుగా ఉండి ఆయన కను సన్నల్లో పనులన్ని చక్క బెట్టిన నారాయణ ఎక్కడ అనే అనుమానం కలుగుతుంది..

 

 

మరి ఇది నిజమైతే ఈ రోజు వస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో నారాయణ ఎందుకు నోరు విప్పడం లేదు. అసలు ఎక్కడ ఆయన పేరు వినబడటం లేదంటే, ఈ అవినీతి ఆరోపణలు నిజమనే సందేహం ఏపీ ప్రజలకు వస్తుందట. నిజానికి నారాయణ బయటకు వస్తే, జరిగిన అభివృద్ధి, నాయకుల వెనక దాగిన అవినీతి బయటకు వస్తుందట.

 

 

అందుకే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ ను చంద్రబాబే తెరపైకి తీసుకురాకుండా అతన్ని కాపాడుతున్నాడనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.. ఇకపోతే నారాయణను గనుక పట్టుకుంటే అన్ని నిజాలు వాటంతట అవే బయట పడతాయని ఇప్పుడు కొందరు నాయకులు చెప్పుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: