రాజధాని రైతుల విషయంలో రాష్ట్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు పదేళ్ళ పాటు కౌలు ఇవ్వాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మరో ఐదేళ్ళు పొడిగించాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనకు చట్ట రూపం ఇవ్వటానికి ఈరోజు నుండి మూడు రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగబోతోంది. ఇందులో భాగంగానే ముందు మంత్రివర్గ సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో  ఆందోళన చేస్తున్న రైతులకు ఉపశమనం కలిగేట్లుగా కౌలు కాలపరిమితిని పదేళ్ళ నుండి 15 సంవత్సరాలకు పెంచాలని డిసైడ్ చేసింది. అలాగే సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. అలాగే పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్రాభివృద్ధి చట్టం-2020కి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్తతో విచారణ జరిపించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. 

 

భూములిచ్చిన రైతుల్లో జరీబు భూముల రైతులకు ఏడాదికి రూ. 50 వేలు కౌలు అందుతోంది. అలాగే  మిగిలిన రైతులకు  రూ. 30 వేల కౌలు చెల్లిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి కౌలు కాలపరిమితిని 15 ఏళ్ళకు పెంచాలన్న నిర్ణయం మాత్రం బయటకు వచ్చింది. మరి కౌలు మొత్తాన్ని కూడా పెంచుతారని జరిగిన ప్రచారంపై మాత్రం సమాచారం లేదు. కౌలు మొత్తాన్ని కూడా జరీబు రైతులకు ఏడాదికి  రూ. 75 వేలు కానీ లక్ష రూపాయలు కానీ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది. అలాగే మిగిలిన రైతులకు రూ. 50 వేలు లేదా రూ. 75 వేలకు పెంచే అంశాన్ని పరిశీలించింది. అలాగే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లకు అదనంగా 200 గజాలు కేటాయించాలని కూడా డిసైడ్ అయ్యింది. 

 

తాజా క్యాబినెట్ నిర్ణయాల విషయంలో కౌలు పెంపు విషయంలో చర్చ జరిగిందా లేదా అన్నది ఇంకా తెలీలేదు.  సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే 11 వేల  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ  కేంద్రాల ద్వారా రైతులకు ఏ విధమైన భరోసా ఇస్తారో స్పష్టత లేదు. అలాగే ఏపి అభివృద్ధిపై జీఎన్ రావు కమిటి, బిసిజి నివేదికలపై చర్చించిన హౌ పవర్ కమిటి అందించిన రిపోర్టును కూడా మంత్రివర్గం ఆమోదించింది లేండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: