ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హై పవర్ కమిటీ నివేదికను ఆమోదించింది. దాదాపు 137 పేజీలతో ఇచ్చిన నివేదికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పింది. భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు పది నుంచి పదిహేనేళ్ల వరకూ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రమంతటా మొత్తం 11 వేలకు పైగా భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.

 

విశాఖపట్నంకు సచివాలయం, హెచ్‌వోడి కార్యాలయాలు. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలోనే మూడు అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

 

అంతే కాదు.. ఇక ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ జరగనుంది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీకి ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనకు చెక్ పెట్టడానికి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 11వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది.

 

కీలకమైన ఈ నివేదికను ఆమోదించడంతో ఇక కీలక నిర్ణయాలకు ఆస్కారం ఏర్పడింది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక స‌మావేశాలలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: