మూడు రాజధానుల ఏర్పాటును సామాజిక వర్గాల కోణంలో చూసుకుంటే ఇది చాలా ఉత్తమమైన చర్యగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కమ్మ, సీమలో రెడ్లు, ఉత్తరాంధ్రలో కాపులతో పాటు ఎస్సి, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా మూడు రాజధానుల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బాగా లబ్ది పొందే అవకాశాలు ఉన్నట్టు లెక్కలు బయటకి వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం ఒకే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని ఏర్పాటుకు మొగ్గుచూపారు. కానీ అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. 


రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా అమరావతిని రాజధానిగా ఎంపిక చేయొద్దంటూ నివేదికలు ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దీని కారణంగా ఏపీలో మిగతా ప్రాంతాల్లో టిడిపిపై తీవ్ర అసంతృప్తి రేగింది. ముఖ్యంగా కాపు, రెడ్లు, ఎస్సీ బీసీలు తదితరులు తాము ప్రాధాన్యత కొలపాయమనే భావనకు వచ్చారు. దాని ఫలితంగానే ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందింది.  హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసాను అని చెప్పుకున్న చంద్రబాబు అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కే పరిమితం చేసి మిగతా ప్రాంతాలలో పట్టించుకోకపోవడం కారణంగానే ఇప్పుడు ఏపీకి ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పటికీ వినిపిస్తున్న మాట. 


అప్పట్లోనే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మేధావులు సైతం చెబుతున్నారు. అదే తప్పు తాను కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే దిశగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాంతాలను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ నిర్ణయం కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని కులాల వారు బాగా లబ్ది పొందే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న జగన్ తమ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా మూడు రాజధానుల ఏర్పాటుకు మొగ్గుచూపి అసెంబ్లీలో వికేంద్రీకరణకు ఆమోదం దక్కేలా చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: