టిఆర్ఎస్ నేత ఆలేటి మహేందర్రెడ్డి హైదరాబాద్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నాగోల్ ప్రాంతానికి చెందిన ఆలేటి మహేందర్ రెడ్డి... టీఆర్ఎస్ కీలక నేతగా ఎన్నో రోజుల పాటు కొనసాగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేపట్టిన ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎంతోమందిని ముందుండి నడిపించారు. ఇక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ యువతరాష్ట్ర   నాయకుడిగా కూడా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి గా కూడా పని చేశారు ఆలేటి మహేందర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం కాలం నాటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతగా కొనసాగారు ఆలేటి మహేందర్ రెడ్డి.

 

 

 మహేందర్ రెడ్డి మృతితో అటు టిఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగోల్ ప్రాంతానికి చెందిన ఆలేటి మహేందర్ రెడ్డి మృతితో నాగోలు న్యూ నాగోల్ స్నేహపురి కాలనీ లోని స్నేహితులు బంధువులు పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ వెన్నంటే ఉండి ముందుకు నడిచిన ఆలేటి మహేందర్ రెడ్డి...  తెలంగాణరాష్ట్ర  సాధన  తర్వాత టిఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవి ఆశించకుండా... టిఆర్ఎస్ పార్టీకి సేవ  చేస్తారు.

 

 

 పదవుల కోసం కాదు పార్టీ కోసమే పని చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరించేవారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆలేటి మహేందర్రెడ్డి వ్యాపారం కూడా సరిగ్గా సాగుతున్న తరుణంలో ఆలేటి మహేందర్రెడ్డి మరణించడం అందరినీ కలిసి వేస్తుంది. ఇక ఆలేటి మహేందర్ రెడ్డి మరణంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా టిఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర నాయకుడు అయిన ఆలేటి మహేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన మృతికి పలువురు టీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: