వావ్.. గ్రేట్ సీఎం.. రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక్క చోటే కాదు.. రాష్ట్రమంతా అభివృద్ధి కావాలి.. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. లేదు అంటే అన్యాయం జరుగుతుంది.. అని.. ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో కోస్తాఆంధ్ర.. రాయలసీమ.. అమరావతి సైతం సంతోషించగా.. 

                   

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కళ్ళలో కరం పోసుకొని... రాజధాని రైతులను రెచ్చగొట్టి.. ఎంతోమంది పెయిడ్ ఆర్టిస్టులను దింపి నానా హంగామా చేస్తూ రాష్ట్రంలో ప్రశాంత లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అయితే అన్ని నిరసనలు.. అన్ని గొడవలు చేసినప్పటికీ.. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఈ నిర్ణయమే కరెక్ట్ అని నేడు తేల్చేశారు. 

 

అయితే అయన తీసుకున్నట్టుగానే.. అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ‌తో అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం జరిగేలా.. ప్రస్తుతం సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో అన్ని ప్రాంతాలూ అబివృద్ధి సాగేలా... కృష్ణా వాట‌ర్‌తో సీమ కూడా అభివృద్ది అయ్యేలా చూస్తున్నారు మన ముఖ్యమంత్రి. కోస్తాఆంధ్ర.. రాయలసీమ.. ఉత్తరాంధ్రా అందరూ అభివృద్ధితో హీరోలు అయ్యేలా సీఎం జగన్ రూపొందించారు. 

                         

రాష్ట్రంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో అభివృద్ధి ప‌రుగులు పెట్ట‌డం ఖాయం. ఎక్క‌డిక‌క్క‌డ ప‌నుల విభ‌జ‌న‌, అభివృద్ధి విభ‌జ‌న అధికార విభ‌జ‌న జ‌రుగుతుంది. అన్ని వ్యాపార‌, ఉద్యోగ వ‌ర్గాల‌కు మూడు రాజ‌ధానుల‌తో స‌మ‌న్యాయం జ‌రుగుతుంది. ఎక్క‌డిక‌క్క‌డ సంస్థ‌ల ఏర్పాటు, కార్యాల‌యాల ఏర్పాటుతో ప్ర‌జ‌ల‌కే కాకుండా ఉద్యోగుల‌కు, వ్యాపారుల‌కు మంచి జ‌రుగుతుంది. అంతేకాదు.. రాష్ట్రమంతా అభివృద్ధి అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: