గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు అంశం రాజకీయాలను వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని తరలించకుండా ఆపుతామంటూ  విపక్ష పార్టీలు అంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు ఏర్పాటు చేసి  రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తామని అంటుంది  జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు అమరావతి రైతులు కూడా గత నెల రోజుల నుండి జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపడుతున్నారు. 

 

 

 ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి  సర్కార్ తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా సీఆర్డీఏ  ను రద్దు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాజధానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతున్న నేపథ్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ బిఎసి సమావేశానికి వైసీపీ తరఫున ముఖ్యమంత్రి జగన్ బుగ్గన శ్రీకాంత్ రెడ్డి హాజరుకాగా... టిడిపి తరఫున అచ్చం నాయుడు ఒక్కరే హాజరయ్యారు. ఈ సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగింది. పులివెందులలో డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. 

 

 

 ఈ సందర్భంగా పులివెందులకు అదిరిపోయే వార్త చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పులివెందుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని... పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంలో మునిగిపోయారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు పులివెందుల ప్రజల అందరి ముఖాల్లో ఆనందం నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: