అసెంబ్లీలో ఈ రోజు మూడు రాజధానుల అంశంపై అధికార, విపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా మతాల యుద్ధం జరిగింది. ఈ విషయంపై విపక్షాలు అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా టిడిపి పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చేయకుండా, అమరావతిని నాశనం చేశారన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు సామాజిక వర్గానికి ఒక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండేదని, ఇప్పుడు రెండు రాజధానులు వచ్చాయన్నారు. విశాఖపట్నంలో 50 నుంచి 80 శాతం వ్యాపారులు ఆ సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కొడాలి చెప్పారు. 

 

 అమరావతి అనేది ఒక మోసం అని, అసలు అమరావతికి చంద్రబాబు చెబుతున్న అమరావతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని పెట్టాలని జగన్ చెప్పారని, ఆయన అన్నారు. అలాగే అమరావతి రాజధానిగా ఉన్నా లేకపోయినా గుంటూరుజిల్లాలో ఏమీ నష్టం జరగలేదని అన్నారు.  మా కమ్మోళ్లు సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎం జగన్ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నారని, అటువంటి వ్యక్తి గురించి చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తే ఊరుకోమని , గట్టిగా బుద్ది చెబుతామని నాని హెచ్చరించారు.

 

 రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ సంబంధించి సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే అమరావతి రాజధాని కొనసాగుతుందని, గతంలో ఉన్న ఒప్పందాల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు పిచ్చికుక్కలా తిరుగుతున్నారని నాని మండిపడ్డారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రాజధానిని నిర్మించలేని అసమర్ధుడు చంద్రబాబు అంటూ నాని విమర్శించారు. రాజుల కాలం నాటి అమరావతిని చంద్రబాబు ఎప్పుడో పాడుపెట్టారు. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు అమరావతి అంటూ వ్యాఖ్యానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: