ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని... చంద్రబాబు బినామీలు ఈ ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారు అంటూ అధికార వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ కూడా ఈ నివేదికను పూర్తి వివరాలతో ఏపీ మంత్రి వర్గానికి అందించింది. అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణ జరుపుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చెప్పిన విషయం తెలిసిందే. కాగా నేడు జరుగుతున్న అత్యవసర అసెంబ్లీ సమావేశంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు  సంబంధించి వైసీపీ నేతలు అందరూ చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు సహా టిడిపి నేతలందరు  తమ బినామీల పేరుతో అమరావతిలో  భూములు కొన్నారని... అసెంబ్లీ వేదికగా వివరిస్తున్నారు వైసీపీ నేతలు. 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని... చంద్రబాబు బినామీల చిట్టా మొత్తం అసెంబ్లీ వేదికగా చదివి వినిపించారు. చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల అభివృద్ధి ప్రయోజనాలను పట్టించుకోలేదని తన సొంత ప్రయోజనాలే  చంద్రబాబుకు ముఖ్యం అంటూ వాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని. అమరావతిలో రాజధాని నిర్మించాలని అనుకున్న చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ముందుగానే టిడిపి నేతలు అందరికీ సమాచారం అందించారని.. దీంతో టీడీపీ నేతలు తమ బినామీలతో అక్రమంగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. 

 

 

 గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయారని...  ప్రస్తుతం ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని ప్రజలు అందరినీ మోసం చేస్తూ చంద్రబాబు భూముల దోపిడీ చేశారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాని విమర్శించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు ఎంతో లబ్ధి పొందారని విమర్శించారు. ఇక చంద్రబాబు బినామీల పేర్లను అసెంబ్లీలో చదివి వినిపించారు ఎమ్మెల్యే కాకాని. అంతేకాకుండా 800 తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అమరావతిలో భూములు కొన్నారని... తెలంగాణకు చెందిన 30 తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు కూడా అమరావతిలో భూములు కొన్నారు అంటూ చంద్రబాబు అక్రమాల చిట్టా అసెంబ్లీలో చదివి వినిపించారు ఎమ్మెల్యే కాకాని.

మరింత సమాచారం తెలుసుకోండి: