ఈరోజు అసెంబ్లీ లో అధికార పార్టీ వైసీపీ సభ్యులు ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఒక ఆట ఆడుకున్నారు. గతంలో చంద్రబాబు రాజధాని విషయంలో చెప్పిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను పోల్చి చూపిస్తూ ఆయనను గుక్క తిప్పుకోకుండా చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోలను చూపిస్తూ ఇరుకున పెట్టారు. ఈ విషయంలో సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ పంచ్ డైలాగులు చెబుతూ ఆయన మీద పాటలు పాడుతూ చంద్రబాబు పరువును సభాముఖంగా తీసేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతున్నంత సేపు అధికార పార్టీ సభ్యులు బల్లలు చర్చడంతో చంద్రబాబుకు మరింత ఆగ్రహం కలిగించింది. 


రాజధాని పేరుతో అమరావతి  రైతులను చంద్రబాబు మోసం చేశారని, రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామీలు ఆ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి రైతులను మోసం చేశారని, అప్పట్లో భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులను బాగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు విమర్శించారు. బలహీన వర్గాల భూముల విషయంలోనూ చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబు ఊరు ఊరు వెళ్లి రాజధాని గురించి మాట్లాడుతున్నారని, జగన్ పరిపాలనను తుగ్లక్ పరిపాలన అంటూ మాట్లాడుతున్నారని, హైదరాబాదులో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా హడావుడిగా తట్టాబుట్టా సర్దుకుని వచ్చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ అంబటి విమర్శించారు.


10 సంవత్సరాలు దర్జాగా హైదరాబాద్లో ఉండి అప్పటిలోగా ఏపీలో పూర్తిస్థాయిలో రాజధాని నిర్మించుకునే అవకాశాన్ని వదులుకున్న చంద్రబాబు పాలన తుగ్లక్ పాలన కాదా అంటూ అంబటి కామెంట్ చేశారు. విభజన తర్వాత హైదరాబాదులో ఏపీ రాజధాని వుంటుందని చెప్పి అక్కడ బిల్డింగులను కోట్లు పెట్టి ఖర్చుపెట్టే బాగా చేశారని, అన్ని రెడీ అయిన తర్వాత హడావుడిగా ఏపీకి ఎందుకు రావాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడంలో ఉంటున్న చంద్రబాబు ది తుగ్లక్ పాలన కాదా అంటూ అంబటి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: