తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతుంది. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు తో మొదలు అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు ని రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏకంగా జోళ్ళు పట్టుకుని డబ్బులు అడుక్కునే స్థాయికి చంద్రబాబు రాజకీయ జీవితం పడిపోయిందని ప్రజలను మోసం చేయడంతో ప్రజల ఉసురు గట్టిగా చంద్రబాబుకి తగులుతుందని ప్రజలను మోసం చేస్తే ఇలానే ఉంటుందని అధికార పార్టీకి చెందిన నాయకులు కామెంట్లు చేస్తున్నారు.

 

అయితే ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజధాని అమరావతి విషయంలో అదేవిధంగా చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు రాజధానిగా ప్రకటించక ముందు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు కుటుంబ సభ్యులు చంద్రబాబు బినామీలు కొన్న భూముల వివరాలను ఎవరు ఎక్కడ ఎంతకు కొన్నారు ఎన్ని ఎకరాలు కొన్నారు అన్ని విషయాలనూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టడంతో ఇదే సమయంలో స్పీకర్ ఈ విషయాల పై విచారణ చేయాలని ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే వైయస్ జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు సభలో స్పీకర్ కి ఎవరు ఇచ్చారు ఈ అధికారం అంటూ విచారణకు ఆదేశించిన తీరుపై మండిపడ్డారు.

 

ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్విట్జ‌ర్లాండ్ రాజ‌ధాని దావోస్ లో జ‌రిగే ప్ర‌పంచ ఆర్థిక సమావేశాలకు ప్రతిఏటా వెళ్లి పాల్గొన్న చంద్రబాబు ఈ ఏడాది కూడా వెళ్లే అవకాశాలు ఉన్న తరుణంలో ఒకవేళ వైయస్ జగన్ వెంటనే విచారణకు చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని విచారణ చేపడితే చంద్రబాబు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదని ఇంకా చంద్రబాబుకి నిద్రలేని దగ్గర్లో ఉన్నట్లే అని ఇన్సైడర్ ట్రేడింగ్ రుజువైతే దేశంలోనే అతిపెద్ద కేస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: