జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ చాలా దయనీయంగా కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే సినిమా రంగం లోకి వెళ్ళిపోతారు అని అందరూ అనుకున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు కూడా ఇక పవన్ కళ్యాణ్ రాజకీయంగా గుడ్ బై చెప్పి ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతారు అని కామెంట్ చేశారు. ఆ సందర్భంలో ఓటమి నుండి తేరుకుని నా చివరి కట్టె కాలే వరకు ప్రజా సమస్యలపై పోరాటం ఉంటుందని ఆ సమయంలో ఓటమితో నిరుత్సాహానికి గురైన జన సైనికులకు తెలియజేసి ప్రతి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్.

 

అయితే తాజాగా పార్టీ ఓడిపోతే ఏడు నెలలుగా వస్తున్న తరుణంలో బిజెపి పార్టీతో చేతులు కలిపి జనవరి 20వ తారీఖున బాలీవుడ్ రీమేక్ మూవీ పింక్ సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యి మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని గురించి చర్చలు జరుగుతున్న సందర్భంలో తన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి అమరావతి రాజధాని కి సపోర్ట్ చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ముందుకు నడవాలని ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ ఆదేశాలను లెక్క చేయకుండా వికేంద్రీకరణ పేరిట వైయస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం చాలా కరెక్ట్ అని జై కొట్టడంతో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీలో హాట్ టాపిక్ అయింది.

 

అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వికేంద్రీకరణ కు జై కొట్టడంతో ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీలో కూర్చున్న వైఎస్ జగన్ చేతులు పైకెత్తి మరి రాపాక వరప్రసాద్ ప్రసంగానికి చప్పట్లు కొట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: